- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పల్లె ప్రకృతి వనం సందర్శించిన జిల్లా అధికారులు
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారులు మండల పరిధిలోని డిండి చింతపల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, నర్సరీలను శనివారం సందర్శించారు.

దిశ, వంగూర్ : ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారులు మండల పరిధిలోని డిండి చింతపల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, నర్సరీలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా డీపీవో శ్రీరాములు, డీఎల్పీవో దుర్గాప్రసాద్, ఎండీఓ బ్రహ్మచారి, ఎంపీఓ నర్సింహులు గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం, నర్సరీలను పరిశీలించి అక్కడి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రకృతి సౌందర్యంతో ఎంతో అందంగా తీర్చిదిద్దిన పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించిన అనుభూతి కలిగిందని డీపీవో శ్రీరాములు పేర్కొంటూ గ్రామ సర్పంచ్ రామ్ భీష్మను అభినందించారు. గ్రామ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ రామ్ భీష్మ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి మరోసారి జిల్లా అధికారులను ఆహ్వానిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ రెడ్డి, శేఖర్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.






