- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం ప్రియులకు 'సహకారంగా' జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న పాత బస్ స్టాండ్ పెట్రోల్ బంక్ ప్రక్కన, కూత వేటు దూరంలోని ఎస్పీ కార్యాలయం సమీపాన ఉన్న 'జిల్లా సహకార కేంద్ర మార్కెటింగ్ సంఘం లిమిటెడ్' కార్యాలయం మందు బాబులకు 'సహకారంగా' మద్యం సేవించి గొడవలకు అడ్డగా మారింది.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న పాత బస్ స్టాండ్ పెట్రోల్ బంక్ ప్రక్కన, కూత వేటు దూరంలోని ఎస్పీ కార్యాలయం సమీపాన ఉన్న 'జిల్లా సహకార కేంద్ర మార్కెటింగ్ సంఘం లిమిటెడ్' కార్యాలయం మందు బాబులకు 'సహకారంగా' మద్యం సేవించి గొడవలకు అడ్డగా మారింది. నిత్యం రైతులు వచ్చిపోయే ఈ కార్యాలయంలో, చీకటి పడితే చాలు మందు తాగుతూ జల్సా చేస్తున్నారు. పొద్దున్నే కార్యాలయం పరిసరాల మొత్తం మందు బాటిళ్ల తో దర్శనమిస్తున్నాయి. కార్యాలయం సమీపంలోనే వైన్ షాప్ ఉండడంతో సాయంత్రం కార్యాలయం సమయం ముగిసిన వెంటనే కార్యాలయ గేటు గుండా ప్రవేశించి తమ పని కానిచ్చేస్తున్నారు. సిబ్బంది గేటు కు తాళం వేయకుండా వెళ్ళిపోవడంలో ఆంతర్యం ఏమిటో అర్ధం కావడంలేదు. ఇంత జరుగుతున్న సహకార సంఘం అధికారులు కానీ, సిబ్బంది గానీ పట్టించుకోవడం లేదంటే వారి నిర్లక్ష్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. సహకార సంఘం అధికారులు ఇప్పటికైనా మందుబాబులకు 'సహకారం' అందించడం మాని తగిన భద్రతా ఏర్పాట్లను చేయాలని ప్రజలు కోరుతున్నారు.






