క‌ళ్యాణ ల‌క్ష్మీ, షాది ముబార‌క్ చెక్కుల పంపిణీ

by Ratna Kumari |

దిశ‌, మ‌ద్దూరు : మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్

క‌ళ్యాణ ల‌క్ష్మీ, షాది ముబార‌క్ చెక్కుల పంపిణీ
X

దిశ‌, మ‌ద్దూరు : మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ నరసింహులు మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకం పేదింటి ఆడపడుచు తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించి 158 మంది లబ్ధిదారులకు రూ.15,818,328 విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బీములు, మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి, తహసిల్దార్ మహేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Next Story