వేరుశనగ విత్తనాల పంపిణీ

by Ratna Kumari |

దిశ‌, పాన్ గ‌ల్ : మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో నాబార్డ్ సహకారంతో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ ప్రైవేట్ కంపెనీ FPO, రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు

వేరుశనగ విత్తనాల పంపిణీ
X

దిశ‌, పాన్ గ‌ల్ : మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో నాబార్డ్ సహకారంతో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ ప్రైవేట్ కంపెనీ FPO, రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు వంద శాతంతో సబ్సిడీ పై వేరు శనగ విత్తనాలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్, వ్యవసాయ శాఖ ఏడీఏ తిప్పే స్వామి లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూనె గింజల ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం రైతులకు వంద శాతంతో విత్తనాలను సబ్సిడీ ఇస్తుంద‌ని తెలిపారు. రైతులు నూనె ఉత్పత్తులను పెంపొందించేందుకు వేరుశనగ పంటలను సాగు చేయాలన్నారు. మండల కేంద్రంలో ఆయిల్ మిల్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నార‌ని తెలిపారు. వేరుశనగ పంటను సాగు చేసే ప్రతి రైతుకు 80 కేజీ ల చొప్పున పంపిణీ చేస్తామని తెలిపారు. రైతులు సంబంధిత ఏఈఓ ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలోఎఫ్ పీఓ ఫౌండేషన్ సభ్యులు శ్రీనివాస్ కుమార్, రత్నగిరి ఫౌండేషన్ డైరెక్టర్ శివశంకర్, కేతూరి దర్మ తేజ, వ్యవసాయ అధికారి డాకేశ్వర్ గౌడ్, మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు, మాజీ జ‌డ్పీటీసీ రవికుమార్, విండో మాజీ వైస్ ఛైర్మన్ ముంతభాస్కర్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు మధుసూదన్ రెడ్డి, రాము యాదవ్, జయ రాములు సాగర్, పుల్లారావు, బ్రహ్మం పాల్గొన్నారు.

Next Story