- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్: వార్త వచ్చిన మూడు గంటల్లోనే నీటి సమస్యకు పరిష్కార దిశగా అడుగులు
నాగర్ కర్నూల్ జిల్లా పదరా మండలం మద్దిమడుగు చెంచు కాలనీలో గత 15 రోజులుగా మంచినీటి సమస్యతో

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా పదరా మండలం మద్దిమడుగు చెంచు కాలనీలో గత 15 రోజులుగా మంచినీటి సమస్యతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలోని ప్రజలు నిత్యం కొంత దూరంలో ఉన్న చింతమట్ట మడుగు నుంచి నీరు తెచ్చుకుంటూ కష్టాలు పడుతున్నారు.
ఈ సమస్యపై బుధవారం మధ్యాహ్నం “దిశ”లో వచ్చిన వార్తకు సంబంధిత అధికారులు మూడుగంటల్లోనే స్పందించారు. తక్షణమే నీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి అశోక్ దిశతో ఫోన్‌లో మాట్లాడుతూ... “చెంచు కాలనీలో నీటి సమస్య వాస్తవమే. బోరు మోటర్ రిపేర్ చేస్తుండగా అది లోపలే జారి పోయింది. మెకానిక్‌తో చాలా ప్రయత్నించినా బయటకు తీయలేకపోయాం. దీంతో బుధవారం RWS అధికారి హర్షిత్ రెడ్డితో చర్చించి కొత్త మోటర్‌తో పాటు అవసరమైన పరికరాలు కొనుగోలు చేశాం. గురువారం కాలనీలో నీటి సరఫరా పునరుద్ధరిస్తాం” అని తెలిపారు.






