- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశా ఎఫెక్ట్.. ఎమ్మెల్యే ఆదేశాలతో కదిలిన యంత్రాంగం..!
దిశ, గోపాల్ పేట : కరెంట్ షాక్ తో 8 గేదెలు మృతి చెందిన ఘటన అందరికీ తెలిసిందే. ఉమ్మడి మండల అధ్యక్షుడు సత్య శిల్లారెడ్డి చేరుకొని రైతులతో మాట్లాడి ఏఈ, డీఈ, ఏడీ సంఘటన స్తలానికి పిలిపించి గేదేలు చనిపోఓయిన పూసల చెరువును పరిశీలించారు. ముద్దుల కొల్ల మల్లయ్య ఆరు గేదెలు, బూజుల భాస్కర్ రెడ్డి రెండు గేదెలు

దిశ, గోపాల్ పేట : కరెంట్ షాక్ తో 8 గేదెలు మృతి చెందిన ఘటన అందరికీ తెలిసిందే. ఉమ్మడి మండల అధ్యక్షుడు సత్య శిల్లారెడ్డి చేరుకొని రైతులతో మాట్లాడి ఏఈ, డీఈ, ఏడీ సంఘటన స్తలానికి పిలిపించి గేదేలు చనిపోఓయిన పూసల చెరువును పరిశీలించారు. ముద్దుల కొల్ల మల్లయ్య ఆరు గేదెలు, బూజుల భాస్కర్ రెడ్డి రెండు గేదెలు చనిపోయిన విషయాన్ని రైతు ద్వారా తెలుసుకొని కరెంటు తీగలు పూసల చెరువు నీళ్లకు అనుకొని ఎర్త్ ఇవ్వడం వల్ల చెరువు కట్టపై ట్రాన్స్ ఫార్మార్ పెట్టడం వల్ల గేదెలు చనిపోయాయని పాడి రైతులు అధికారులకు తెలిపారు. చెరువు కట్ట మీద మరియు ఎర్త్ వైరు నీళ్ల పక్కల ట్రాన్స్ ఫార్మార్ఉండడం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తలేదని రైతులు బాధపడుతూ బోరున విలపించారు. రైతు ముద్దుల కొల్ల మల్లయ్య బోరున విలపిస్తూ ఒక్కొక్క గేదె దాదాపు లక్ష రూపాయల పైన విలువ ఉంది. గేదెల మృతితో దూడలను ఒంటరివి అయ్యానని.. అప్పులను ఎలా కట్టాలని రైతు బోరున ఏడుస్తుంటే కరెంటు అధికారులు నష్టపరిహారం వచ్చే విధంగా న్యాయం చేస్తామని ఉమ్మడి మండల అధ్యక్షుడు సత్యశిల్లారెడ్డి మాట్లాడి తగిన న్యాయం చేసి ప్రభుత్వం నుండి కరెంటు డిపార్ట్మెంట్ నుండి నష్టపరిహారం వచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
సత్యసిల్లారెడ్డి ప్రజా ప్రభుత్వంలో ఇలాంటి విపత్కర పరిస్థితిల నుండి కరెంటు డిపార్ట్మెంట్, ప్రభుత్వం నుండి ప్రతి గేదకు న్యాయం జరిగే విధంగా చేస్తామని డిఈ, ఏడి, ఉమ్మడి మండల అధ్యక్షుడు సత్యసిల్లారెడ్డి పశువుల డాక్టర్ ఆంజనేయులు, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస నాయుడు రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం ఏఐపిసి నేషనల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి పాడి రైతులుముద్దుల కొల్ల మల్లయ్య, భాస్కర్ రెడ్డిలను పరామర్శించి కొంత ఆర్థిక సాయం అందించారు. సుమారు 25 గేదలు మేపుకుంటూ వెళ్తుండగా గేదెలు చెరువులో ఈతపడుతూ వస్తుండగా 17 గేదెలు ఒడ్డుకు చేరుకోగా ఎనిమిది గేదలు మాత్రం కరెంట్ షాక్ గురై అక్కడికక్కడే- మరణిం చాయని తెలిపారు. ఈ విషయాన్ని ఆదిత్య రెడ్డి మండల వెటర్నరీ డాక్టర్లు, ఎమ్మార్వో, విద్యుత్ ఉన్నత అధికారులతో జరిగిన నష్టాన్ని గేదెల యజమానులకు ప్రభుత్వం తరఫునుండి కరెంటు తరఫునుండి నష్ట పరిహారం వచ్చే విధంగా కృషి చేస్తానని రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అపత్కర పరిస్తితులను దృష్టిలో పెట్టుకొని బాధితులకు మనోధైర్యాన్ని కల్పించారు..






