విశ్వసనీయమైన వార్త వేదికగా నిలిచిన "దిశ" దినపత్రిక : ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

దిశ దినపత్రిక డిజిటల్ మీడియా రంగ విశ్వసనీయ వార్తా వేదికగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి తెలిపారు.

విశ్వసనీయమైన వార్త వేదికగా నిలిచిన దిశ దినపత్రిక : ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
X

దిశ, జడ్చర్ల : దిశ దినపత్రిక డిజిటల్ మీడియా రంగ విశ్వసనీయ వార్తా వేదికగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నదని, ప్రింట్ పత్రికతో పాటు వెబ్ సైట్, మొబైల్ యాప్ లు, సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రపంచంలో జరుగుతున్న తాజా వార్తలను, వింతలు, విశేషాలను తనకున్న అపారమైన నెట్ వర్క్ ద్వారా క్షణాల్లో సేకరించి పాఠకులకు అదే వేగంతో ఎప్పటికప్పుడు చేరవేస్తూ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో నూతన ఒరవడిని సృష్టిస్తూ ముందుకు సాగుతున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. గురువారం జడ్చర్ల పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన 2026 " దిశ " దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దిశ దినపత్రిక ప్రత్యేకతలను గురించి వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంప్రదాయ పత్రికా విలువలను కాపాడుకుంటూనే ఆధునిక డిజిటల్ సాంకేతికతను వినియోగించి ప్రజలకు దిశ దినపత్రిక వేగవంతమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నదని అన్నారు. టెక్స్ట్ వార్తలతో పాటు వీడియో న్యూస్, ఫోటో కథనాలు, గ్రాఫిక్స్, లైవ్ కవరేజీ వంటి ఆధునిక డిజిటల్ విధానాలను వినియోగిస్తూ దిశ దినపత్రిక పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటున్నదని ఆయన తనదైన శైలిలో పత్రికను కొనియాడారు. పేస్ బుక్, యూట్యూబ్, ఇన్ స్ట్రాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో దిశ డిజిటల్ విస్తృతంగా ప్రజలకు చేరువవుతున్నదని ఆయన అన్నారు. ప్రజా సమస్యలను సత్వరమే డిజిటల్ వేదికగా వెలుగులోకి తీసుకువచ్చి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో దిశ పత్రిక చురుకైన పాత్ర పోషిస్తున్నదని ఆయన అన్నారు. యువతను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగ సమాచారం, విద్య, సమకాలీన అంశాలు, ట్రెండింగ్ న్యూస్ ను సులభమైన తెలుగులో దిశ పత్రిక అందిస్తున్నదని అనిరుద్ రెడ్డి అన్నారు. స్థానిక వార్తలకు ఎంతగానో ప్రాధాన్యమిస్తూ వేగవంతమైన అప్ డేట్ లు, డిజిటల్ కంటెంట్ లు ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలతో దిశ దినపత్రిక మీడియా రంగంలో విశ్వసనీయ వార్తా వేదికగా తన ప్రత్యేకతను మరింత బలోపేతం చేసుకుంటున్నదని, దానివల్ల పత్రికకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో దిశ దినపత్రిక మహబూబ్ నగర్ బ్యూరో ఇంచార్జ్ నర్సింహులు, దిశ దిన పత్రిక జడ్చర్ల ఆర్సి ఇంచార్జ్ నిస్సార్ అహ్మద్, సీనియర్ పాత్రికేయులు బరిగెల వెంకటయ్య, దిశ దినపత్రిక నవాబుపేట, మిడ్జిల్, రాజాపూర్ మండలాల విలేఖరులు యాదిలాల్ జీ, శ్రీనివాస్, హరీష్ పాల్గొన్నారు.

Next Story