యువకుడి అదృశ్యం

by Elthuri vijay kumar |

మండల పరిధిలోని లోకిరేవు గ్రామానికి చెందిన కావలి ప్రవీణ్ ఈనెల 20న అదృశ్యమయ్యాడు.

యువకుడి అదృశ్యం
X

యువకుడి అదృశ్యం

దిశ, నవాబుపేట: మండల పరిధిలోని లోకిరేవు గ్రామానికి చెందిన కావలి ప్రవీణ్ ఈనెల 20న అదృశ్యమయ్యాడు. ఆరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో బయటికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుండి బయలుదేరి వెళ్లిన ప్రవీణ్ నేటికి కూడా ఇంటికి రాలేదని, ఆయన కోసం ఎంతగా వెతికినా కూడా ఆచూకీ లభించలేదని యువకుడి తల్లి కావలి సత్యమ్మ తెలిపారు. తన కుమారుడి ఆచూకీ కనుగొనాలని కోరుతూ ఆమె మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్ఐ జనార్ధన్ తెలిపారు.

Next Story