- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ ప్రమాద మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా
దిశ, పాన్ గల్ : మండల కేంద్రానికి చెందిన మధుసూదనన్ యాదవ్ విద్యుత్ ప్రమాదానికి గురై నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే

దిశ, పాన్ గల్ : మండల కేంద్రానికి చెందిన మధుసూదనన్ యాదవ్ విద్యుత్ ప్రమాదానికి గురై నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అతని కుటుంబానికి న్యాయం చేయాలని ఇవ్వాళ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే మధు మృతి చెందాడని అగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. సీఐ కృష్ణ, ఎస్సై శ్రీనివాసులు, ట్రాన్స్ కో ఎస్సై మదన్ ఇన్చార్జ్ ఎడి రాజయ్య గౌడ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. విద్యుత్ ఏడి రాజయ్య గౌడ్ మాట్లాడుతూ సంఘటన జరగడం బాధాకరమని.. ఒక మంచి వ్యక్తిని కోల్పోవడం దురదృష్టకరమన్నారు. మృతుని కుటుంబానికి ఇన్సూరెన్స్ తో పాటు విద్యుత్ శాఖ పరంగా రావాల్సిన అన్ని రకాల ఆర్థిక సహాయాన్ని అందే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు ధర్నాను విరమించారు. ధర్నాలో గ్రామస్తులతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.






