- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HCU నుండి ఉన్నత శిఖరాలకు..!
దిశ, నిజాంసాగర్ : సాధారణంగా పండుగలు బంధాలను బల పరుస్తాయి. రాష్ట్ర పోలీస్ బాస్, డీజీపీ బి. శివధర్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కలయిక మధ్య బంధం

దిశ, నిజాంసాగర్ : సాధారణంగా పండుగలు బంధాలను బల పరుస్తాయి. రాష్ట్ర పోలీస్ బాస్, డీజీపీ బి. శివధర్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కలయిక మధ్య బంధం నిరూపించింది. యూనివర్సిటీ రోజుల్లోని తమ స్నేహబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమ్మెల్యే కాంతారావు శనివారం డీజీపీని మర్యాద పూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన డీజీపీకి శుభానికి ప్రతీకగా భావించే జమ్మి ఇచ్చి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇద్దరూ ఒకప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో విద్యార్థులే. డీజీపీ శివధర్ రెడ్డి, కాంతారావు సీనియర్ కావడం విశేషం. అధికారిక విధులకు కాసేపు విరామం ఇచ్చి, ఇద్దరు ఉన్నత స్థానాల్లోని వ్యక్తులు పాత రోజుల్లోకి వెళ్లిపోయారు. హాస్టల్ జీవితం, తరగతి గదుల్లోని కబుర్లు, ఆ నాటి స్నేహం వంటి మధుర జ్ఞాపకాలను కాసేపు నెమరువేసుకున్నారు. పాత స్నేహితులతో జరిపే చిట్‌చాట్ లాగానే వారిద్దరి మధ్య ఈ మర్యాదపూర్వక కలయిక జరిగింది.






