గ్రామాల అభివృద్ధే బీఆర్ఎస్ లక్ష్యం : MLA Abraham

by Disha Web Desk 15 |
గ్రామాల అభివృద్ధే బీఆర్ఎస్ లక్ష్యం :  MLA Abraham
X

దిశ, ఉండవెల్లి : సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు సాగు, తాగు నీరు లేక, గ్రామాలకు సరైన రోడ్లులేక ఇబ్బందులు పడ్డామని, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ వీ.ఎం అబ్రహం అన్నారు. ఇంటింటికీ తాగునీటి నల్లా, చిన్నపాటి గల్లీలకు కూడా సీసీ రోడ్లు, రైతుల కోసం సాగునీరు, ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, ఆడపిల్లల కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించి, ఎలాంటి ఇబ్బంది లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దామని తెలిపారు. గురువారం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల కేంద్రంలో పలు పనులకు ఆయన భూమి పూజ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేవలం ఉండవెల్లి మండలానికి 85 లక్షల రూపాయల నిధులను కేటాయించి అభివృద్ధికి శ్రీకారం చుట్టామని తెలిపారు. అంతేకాక తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి మరో 13 కోట్లు, అలంపూర్ నియోజకవర్గంలోని రోడ్లు వేయుటకు 54 కోట్ల నిధులను మంజూరు చేసి పూర్తి చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచులు రేణుక వెంకట్ గౌడ్, శ్రీలత భాస్కర్ రెడ్డి ఉన్నారు.


Next Story