రెండున్న‌రేళ్ల‌యినా నోచుకోని అభివృద్ధి : మాజీ ఎమ్మెల్యే రాజేంద‌ర్ రెడ్డి

by Ratna Kumari |   (  Updated:2026-01-18 10:54:23  IST  )

దామ‌ర‌గిద్ద మండ‌లం కేత‌న్ ప‌ల్లి వీరభ‌ద్రేశ్వ‌ర ఆల‌యంలో ఆదివారం నూత‌నంగా ఎన్నికైన స‌ర్పంచ్, ఉప స‌ర్పంచ్, వార్డు మెంబ‌ర్ల‌కు బీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో స‌న్మానం నిర్వ‌హించారు.

రెండున్న‌రేళ్ల‌యినా నోచుకోని అభివృద్ధి : మాజీ ఎమ్మెల్యే రాజేంద‌ర్ రెడ్డి
X

దిశ, దామరగిద్ద: దామ‌ర‌గిద్ద మండ‌లం కేత‌న్ ప‌ల్లి వీరభ‌ద్రేశ్వ‌ర ఆల‌యంలో ఆదివారం నూత‌నంగా ఎన్నికైన స‌ర్పంచ్, ఉప స‌ర్పంచ్, వార్డు మెంబ‌ర్ల‌కు బీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో స‌న్మానం నిర్వ‌హించారు. ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే రాజేంద‌ర్ రెడ్డి హాజ‌రై ప్ర‌సంగించారు. క‌ష్ట‌ప‌డి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించార‌ని.. కొంత మంది క‌ష్ట‌ప‌డిన‌ప్ప‌టికీ ఓట‌మి పాల‌య్యార‌ని గుర్తు చేశారు. ఎన్నిక‌ల్లో గెలుపు, ఓట‌ములు స‌హ‌జం అన్నారు. ఓడిపోతే కృంగిపోయేది లేదు.. గెలిస్తే ప్రజలకు ఒక రకమైన సేవ ఉంటుంది. ఓడితే ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున అధికార పక్షాన్ని నిలదీయడం ఉంటుంది. ఎక్కడైనా ప్రజల పక్షాన మాట్లాడేది ఏ రాజకీయ నాయకుడైన, ఏ రాజకీయ కార్యకర్త అయిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే..? బీఆర్ఎస్ కి, కాంగ్రెస్ కి కంపారిజ‌న్ చేయ‌వ‌ద్దు అని సూచించారు. క‌ష్ట‌ప‌డి ప్ర‌జ‌ల కోసం, రైతుల కోసం, విద్యార్థుల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న పార్టీ మ‌న‌ది. బీఆర్ఎస్ హ‌యాంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నామ‌ని తెలిపారు.

రెండున్న‌రేళ్ల‌లో క‌నిపించ‌ని అభివృద్ధి

రేవంత్ రెడ్డి మాయ మాట‌లు చెప్పి అధికారంలోకి వ‌చ్చాడ‌ని తెలిపారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు అవుతున్నా ఎక్క‌డ కూడా అభివృద్ధి జ‌రుగ‌లేద‌న్నారు. కేసీఆర్ హ‌యాంలో 24 గంట‌ల ఉచిత క‌రెంట్, ప్ర‌తి ప‌ల్లెకు ట్రాక్ట‌ర్లు, పల్లె ప్ర‌కృతి వ‌నాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయ‌న్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం మాత్రం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ట్రాక్ట‌ర్ల‌కు పోయ‌డానికి డీజిల్ కూడా లేద‌న్నారు. ఒకసారి మోసపోతే మోసం చేసిన వాడిది తప్పు. కానీ రెండవసారి మోసపోతే మోసపోయిన వాడిదే తప్పు.

జ్యుడీషియల్ కమిషన్ ద్వారా ఎంక్వయిరీ

నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో చాలా అవకవ‌త‌లు జరుగుతున్నాయి. ఆర్టీఐ ద్వారా రిపోర్ట్ తీసుకువచ్చి, ఎకరా పోతే మూడెకరాలు పోయిందని, దొంగ పాస్ బుక్కుల ద్వారా నష్టపరిహారం తీసుకొని డబ్బులు సొమ్ము చేసుకున్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే.. క‌చ్చితంగా మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అప్పుడు జ్యుడీషియల్ కమిషన్ ద్వారా ఎంక్వయిరీ చేసి ప్రతి ఇంటికి పంపించే బాధ్యత నాది అని హెచ్చరించాడు.

నారాయణపేట జిల్లా ర‌ద్దు..?

వీరభద్ర స్వామి గుడిలో ఉండి చెబుతున్న నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు రాసి పెట్టుకోండి. నారాయణపేట జిల్లాను ఎత్తివేయనున్నార‌ని.. ఎప్పుడైతే జిల్లాలను తక్కువ చేస్తామ‌న్నారో.. ఎంతమంది ఎంపీలు ఉన్నారో అన్ని జిల్లాలు ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించి ఒక నియోజకవర్గ ఒక జిల్లాలో ఉంది. జిల్లాలు శాస్త్రీయ బద్దంగా జరగలేదు అని ఒక కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఆ కమిషన్ కి మీరు ఏం చెబితే అదే వారికి చెబుతుంది. ఎప్పుడు ఎన్నికలు పెట్టిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ బీఆర్ఎస్ నుంచి బీఫామ్ ఇవ్వడం జరుగుతుంది. పార్టీ గుర్తు ఉంటుంది. కచ్చితంగా ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ లను గెలిపించుకునే బాధ్యత మీపై ఉంది. దామరగిద్ద మండల ఎంపీపీ సీటును కైవసం చేసుకోవాలని పార్టీ పార్టీ నాయకులకు సూచించారు. నారాయణపేట బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎస్ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story