డీఈవో ఆకస్మిత తనిఖీ

by velandi.Saikiran |

మెనూ ప్రకారం విద్యా ర్థులకు భోజనం పెట్టాలని డీఈవో ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రం లోని కస్తూర్బా విద్యాల

డీఈవో ఆకస్మిత తనిఖీ
X

దిశ, మిడ్జిల్ : మెనూ ప్రకారం విద్యా ర్థులకు భోజనం పెట్టాలని డీఈవో ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రం లోని కస్తూర్బా విద్యాలయం ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. వంట గదిలోకి వెళ్లి భోజనంతో పాటు సరు కులను పరిశీలించారు. నాణ్యమైన భోజనాన్ని విద్యార్థు లకు వడ్డించాలని సూచించారు. కస్తూర్బా విద్యాలయంలో వంట మహిళల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఎస్ఓ కవిత కు సూచించారు. విద్యార్థులకు టైం ప్రకారంగా భోజనం వడ్డించాలని తెలిపారు.

గతంలో ఉన్న వంట మహిళలు అనారోగ్య సమస్య వల్ల రాలేకపోతున్నారని సూచించారు. వాళ్లకు రావడం వీలు కాకపోతే వారి స్థానం లో కొత్త వారిని తీసుకోవాలి సూచించారు. విద్యార్థుల హాజరు ,ఉపాధ్యాయుల పనితీరు పరిశీలించారు. సమయపాలన పాటించి విద్యార్థులకు నాణ్యమైన విద్య ను బోధించాలని తెలిపారు. అదనపు మరుగుదొడ్ల నిర్మాణం పనులు ఎందుకు చేయడం లేదని సంబంధిత కాంట్రాక్టర్ ని అడిగారు. వర్షాల వల్ల పనులు చేయలేకపోయామని సూచించారు. వెంటనే మరుగుదొడ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని డిఈఓ సూచించారు.

Next Story