- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తీరు మార్చుకోని ఉపాధ్యాయులు..మెమో జారీ..!
దిశ, ఇటిక్యాల : పాఠశాల సమయపాలన పాటించి విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న

దిశ, ఇటిక్యాల : పాఠశాల సమయపాలన పాటించి విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం సాతర్ల గ్రామపాఠశాలలో చోటు చేసుకుంది. ఇటిక్యాల మండల పరిధిలోని సాతర్ల ప్రాథమిక పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు ప్రతిరోజూ ప్రార్థన సమయానికి పాఠశాలకు హాజరై విద్యార్థుల చేత ప్రార్థన చేయించాల్సిన అవసరం ఉన్నప్పటికీ ప్రార్థన సమయానికి ఉపాధ్యాయులు రాని కారణంగా విద్యార్థులు ఉపాధ్యాయుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ విద్యాశాఖ రూపొందించిన ముఖ గుర్తింపు ఆధారిత యాప్ డిపార్టుమెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం ( DSE- FRS ) వచ్చినా తీరు మార్చుకోకుండా ఉపాధ్యాయులు ప్రార్థన సమయానికి హాజరు కాకపోవడంతో సాతర్ల పాఠశాలలో కాంప్లెక్స్ హెడ్మాస్టర్ పాగుంటన్న విద్యార్థుల చేత ప్రార్థన చేయించాల్సిన అవసరం ఏర్పడింది.
గవర్నమెంట్ ఉపాధ్యాయుల హాజరు శాతం పెంచాలని DSE- FRS తీసుకురావడం జరిగింది. కానీ ఉపాధ్యాయులు దీనిని పాటించడం లేదని జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. సాతర్ల పాఠశాలలోనే కాకుండా మండల స్థాయిలో వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సరైన సమయానికి పాఠశాలకు హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వివిధ గ్రామాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా విద్య శాఖ అధికారులు పాఠశాలలపై దృష్టి మరల్చి పాఠశాలలకు ఉపాధ్యాయులు సకాలంలో వచ్చే విధంగా నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆయా గ్రామాలలోని విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు కోరుతున్నారు. మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు ఫోన్ లో సంప్రదించగా ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని జిల్లా విద్యాశాఖ అధికారి సంబంధిత హెడ్మాస్టర్ కు మెమో జారీ చేశామని.. ఇక పై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.






