- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికారుల తొందరపాటు నిర్ణయంతో విద్యార్థినిల అవస్థలు
దిశ, మద్దూరు : నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని రెనివట్ల రోడ్డుకు బాలికల గురుకుల పాఠశాలను ప్రైవేట్ బిల్డింగ్ లో నిర్వహిస్తున్నారు. రహదారుల విస్తరణలో భాగంగా మంగళవారం

దిశ, మద్దూరు : నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని రెనివట్ల రోడ్డుకు బాలికల గురుకుల పాఠశాలను ప్రైవేట్ బిల్డింగ్ లో నిర్వహిస్తున్నారు. రహదారుల విస్తరణలో భాగంగా మంగళవారం సాయంత్రం గురుకుల పాఠశాలకు చెందిన సెప్టిక్ ట్యాంకును సంబంధిత అధికారులు కూల్చివేశారు. దీంతో విద్యార్థినిలతో పాటు, రహదారిపై వెళ్లేవారు భరించలేని దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థినిలు అక్కడే భోజనం చేయటం వల్ల సెప్టిక్ ట్యాంకు నుంచి వెలువడె దుర్వాసనతో కడుపు నిండా అన్నం తినలేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటు వ్యాధులు కూడా ప్రబలే ప్రమాదం ఉంది. అధికారులు అనాలోచిత నిర్ణయం వల్ల సెప్టిక్ ట్యాంక్ ను కూల్చివేయడంతో బాత్రూంలను లాక్ వేశారు. విద్యార్థినిలు బాత్రూం వెళ్లాలంటే బయటికి వెళ్లాల్సి వస్తుంది. కావున సంబంధిత విద్యాధికారులు, కలెక్టర్ వెంటనే స్పందించి విద్యార్థినిల అవస్థలను తొలగించాలని వారి తల్లిదండ్రులు, బీజేపీ నాయకులు సాయిలు, రాఘవేందర్ డిమాండ్ చేస్తున్నారు.






