Breaking News : చారకొండలో ఇళ్ల కూల్చివేత.. తీవ్ర ఉద్రిక్తత

by Muthe.Rajitha |   (  Updated:2025-02-05 12:00:36  IST  )

ఉమ్మడి పాలమూరు(Palamuru) జిల్లాలో రోడ్డు నిర్మాణం కోసం అధికారులు చేపట్టిన ఇళ్ల కూల్చివేత(Demolitions) పనులు.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసాయి.

Breaking News : చారకొండలో ఇళ్ల కూల్చివేత.. తీవ్ర ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్ : ఉమ్మడి పాలమూరు(Palamuru) జిల్లాలో రోడ్డు నిర్మాణం కోసం అధికారులు చేపట్టిన ఇళ్ల కూల్చివేత(Demolitions) పనులు.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసాయి. చిన్న పిల్లలను, వృద్ధులను సైతం బలవంతంగా తరలించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. నాగర్‌కర్నూల్(Magar Karnul) జిల్లా చారకొండ(Charakonda)లో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. జడ్చర్ల-కోదాడ(Jadcharla - Kodada) 167వ రహదారి(167th Road) నిర్మాణ పనుల్లో భాగంగా బైపాస్ రోడ్డు(Bypass road) కోసం చారకొండలో 29 ఇండ్లను కూలగొట్టడానికి రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. రోడ్డు భవనాల శాఖ, రెవెన్యూ అధికారులు, పోలీసు బలగాలు, జేసీబీలతో చేరుకోవడంతో గ్రామస్తులు షాక్ కు గురయ్యారు.

పోలీసుల సహాయంతో ఇళ్ళలో ఉన్నవారిని బయటికి పంపి ఒక్కో ఇళ్ళు కూల్చుతూ రావడంతో గ్రామస్తులు అధికారులపై తిరగబడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. బైపాస్ రోడ్డు కోసం మా ఇండ్లు కూలగొట్టొద్దని బాధిత కుటుంబాలు నిరసన వ్యక్తం చేశాయి. కండ్లముందే తమ ఇల్లు కూల్చివేస్తుండడంతో మహిళలు, పిల్లలు, వృద్ధ దంపతులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కూల్చివేతలు ఆపాలని అధికారుల, పోలీసులను వారు కాళ్ళ వేళ్ళ పడటం అందరినీ కలచి వేసింది. ఏడ్చి ఏడ్చి ఓ వృద్ధురాలు సోమసిల్లి పడిపోగా.. స్థానికులు సపర్యలు చేశారు. చిన్న పాపను సైతం పోలీసు వాహనాల్లో తరలించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story