- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Collector Vijayendira Boi : సీఎంఆర్ డెలివరీ సకాలంలో చేయాలి..
సీఎంఆర్ డెలివరీ సకాలంలో నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు.

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : సీఎంఆర్ డెలివరీ సకాలంలో నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో రైస్ మిల్లర్లు, పౌరసరఫరాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావుతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం ఖరీఫ్ సీజన్ 2023-24 లో 55 శాతం సీఎంఆర్ పూర్తి చేసినట్లు, యాసంగి(రబీ) సీజన్ కు సంబంధించి 25 శాతం పూర్తి అయినట్లు తెలిపారు.
ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ బియ్యం (ఎఫ్.సి.ఐ)మిగిలిన వాటిని రోజువారీగా, వారం వారం లక్ష్యాన్ని నిర్దేశించి ఆగస్టు నెల 15 లోపు మిల్లర్లు డెలివరీ చేయాలని ఆమె ఆదేశించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి, పౌరసరఫరాల మేనేజర్ (సీ.ఎస్), డీటీ (ఎన్ఫోర్స్మెంట్స్) నిరంతర పర్యవేక్షణ జరిపి త్వరితగతిన సీఎంఆర్ టార్గెట్స్ పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. అదేవిధంగా సీఎంఆర్ మొదలు పెట్టని రైస్ మిల్లర్లు వెంటనే మొదలు పెట్టి త్వరగా ఎఫ్సీఐకి డెలివరీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్, డీఎం.ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.






