మేతకోసం వెళ్లిన గొర్రెలు మృతి

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, నాగ‌ర్ క‌ర్నూల్ / తాడూర్ : మేత కోసం వెళ్లిన గొర్రెలు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్న వాగులో ప‌డి మృతి చెందిన విషాద ఘ‌ట‌న నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా తా

మేతకోసం వెళ్లిన గొర్రెలు మృతి
X

దిశ‌, నాగ‌ర్ క‌ర్నూల్ / తాడూర్ : మేత కోసం వెళ్లిన గొర్రెలు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్న వాగులో ప‌డి మృతి చెందిన విషాద ఘ‌ట‌న నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా తాడూర్ మండ‌ల ప‌రిధిలోని గోవిందాయిప‌ల్లిలో బుధ‌వారం చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన బాల జంగయ్య సుమారు 30 గొర్రెలను మేపడానికి కాలువ వద్దకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి వాగు ఉదృతి కి కొట్టుకుపోయాయి. దీంతో గొర్రెల కాపరి కన్నీరు మున్నేరుగా విలపించారు. ఇందులో 12 గొర్రెలు మృతి చెంద‌గా.. మరో 8 గొర్రెలు కాలువ‌లో పడి కొట్టుకుపోయాయి. గొర్రెల కాపరిని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ‌స్తులు కోరుతున్నారు.

Next Story