బాధిత కుటుంబాన్ని పరామర్శించిన డీసీసీబీ చైర్మ‌న్

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, పాన్ గ‌ల్ : రెండు రోజుల కింద‌ట విద్యుత్ కార‌ణంగా గుడిసె ద‌గ్దమైన బాధిత కుటుంబాన్ని సోమ‌వారం ఉమ్మ‌డి డీసీసీబీ చైర్మ‌న్ మామిళ్ల‌ప‌ల్లి విష్ణు

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన డీసీసీబీ చైర్మ‌న్
X

దిశ‌, పాన్ గ‌ల్ : రెండు రోజుల కింద‌ట విద్యుత్ కార‌ణంగా గుడిసె ద‌గ్దమైన బాధిత కుటుంబాన్ని సోమ‌వారం ఉమ్మ‌డి డీసీసీబీ చైర్మ‌న్ మామిళ్ల‌ప‌ల్లి విష్ణు వ‌ర్ధ‌న్ రెడ్డి ప‌రామ‌ర్శించారు. మండల పరిధిలోని కేతేపల్లి గ్రామానికి చెందిన గడమాల కురుమయ్యకు చెందిన నివాస గుడిసె ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్నడీసీసీబీ చైర్మన్ గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. ఇక‌ అధైర్య పడవద్దని భరోసా కల్పించారు. రాష్ట్ర ఎక్సైజ్ అండ్ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిల దృష్టికి తీసుకెళ్లి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం తక్షణ సహాయంగా రూ.10వేలు ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో ఆయన వెంట నాయకులు రాజు గౌడ్ రామ్ గోపాల్ రవికుమార్ రమేష్ కృష్ణయ్య భగవంత్ ఉన్నారు.

Next Story