దొంగతనం కేసును చేదించిన దామరగిద్ద పోలీసులు

by Nallavelli.Anjaneyulu |

దిశ, దామరగిద్ద : మండ‌లంలోని మొగ‌ల్మాడ‌క గ్రామానికి చెందిన వెంక‌టేష్ అనే వ్య‌క్తి ఇంట్లో ఈనెల 18న గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు

దొంగతనం కేసును చేదించిన దామరగిద్ద పోలీసులు
X

దిశ, దామరగిద్ద : మండ‌లంలోని మొగ‌ల్మాడ‌క గ్రామానికి చెందిన వెంక‌టేష్ అనే వ్య‌క్తి ఇంట్లో ఈనెల 18న గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దొంగ‌త‌నం చేశారు. దీంతో పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేపడుతున్నామ‌ని ఎస్సై రాజు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సంఘటన స్థలంలోని సేకరించిన ఫింగర్ ప్రింట్ ఆధారంగా దర్యాప్తు కొనసాగించి నిందితులు కర్ణాటక రాష్ట్రం, చిల్లర కోట్రిక గ్రామానికి, చెందిన నవీన్, బైరంకొండ శీను, అని గుర్తించారు. నిందితుల వ‌ద్ద నుంచి దొంగలించిన ఒకటిన్నర తులం చొప్పున రెండు బంగారు ఉంగరాలు, ఆరు మాసాల బంగారు చెవి కమ్మలు, 16 వెండి ఉంగరాలు, ఒక వెండి బ్రాస్లెట్, 30 వేల నగదు స్వాధీన ప‌రుచుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు ప‌రిచిన‌ట్టు ఎస్ఐ రాజు వెల్లడించారు. ఈ కేసును సమర్ధవంతంగా చేదించిన పోలీసు సిబ్బందిని ఎస్ఐ రాజు అభినందించారు.

Next Story