ప్రభుత్వ టీచర్ల ప్రతిష్టకు భంగం : UTF

by Ratna Kumari |

విద్యా కమిషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సమర్పించిన నివేదికలో కమిషన్ పరిధిలో లేని ఉపాధ్యాయుల జీతాల అంశాన్ని ప్రస్తావించడం విచిత్రమని టీఎస్ యుటిఎఫ్ గండీడ్ మండల అధ్యక్షుడు గంట శ్రీనివాస్, కార్యదర్శి పగిడ్యాల్ బోరు కృష్ణయ్య పేర్కొన్నారు.

ప్రభుత్వ టీచర్ల ప్రతిష్టకు భంగం : UTF
X

దిశ, మహమ్మదాబాద్/ గండీడ్ : విద్యా కమిషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సమర్పించిన నివేదికలో కమిషన్ పరిధిలో లేని ఉపాధ్యాయుల జీతాల అంశాన్ని ప్రస్తావించడం విచిత్రమని టీఎస్ యుటిఎఫ్ గండీడ్ మండల అధ్యక్షుడు గంట శ్రీనివాస్, కార్యదర్శి పగిడ్యాల్ బోరు కృష్ణయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉపాధ్యాయులకు గత రెండు మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు విడుదల కాలేదని తెలిపారు. ఉపాధ్యాయుల ప్రాధాన్య సమస్యలను పక్కనబెట్టి జీతాల అంశాన్ని ప్రస్తావించడం ద్వారా ఉపాధ్యాయుల ప్రతిష్టకు భంగం కలిగించినట్లవుతుందని విమర్శించారు. ఇది టీచర్ల మనోభావాలను దెబ్బతీసే చర్యగా భావిస్తున్నామని అన్నారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి ఉపాధ్యాయుల సంక్షేమం, పెండింగ్ బిల్లుల పరిష్కారం, ఖాళీ పోస్టుల భర్తీ వంటి అంశాలపై కమిషన్ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు. తక్షణమే విద్యా కమిషన్ చేసిన సిఫారసులను ఉపసంహరించుకోవాలని, ఉపాధ్యాయుల గౌరవాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Next Story