- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించాలి : బీఆర్ఎస్
by Ratna Kumari |
మండల పరిధిలోని ఎల్లమ్మ రంగాపూర్ గ్రామంలోని వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట ఆదివారం బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు.

X
దిశ, వంగూర్ : మండల పరిధిలోని ఎల్లమ్మ రంగాపూర్ గ్రామంలోని వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట ఆదివారం బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మంద రాజేందర్ రెడ్డి, అంకు సురేందర్ మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సొంత మండలంలోనే ఇప్పటివరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడం శోచనీయమని విమర్శించారు. రైతులు పంటను విక్రయించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, నాయకులు పాల్గొన్నారు.
Next Story






