డిపో మేనేజర్ నిర్లక్ష్యపు సమాధానం పై విద్యార్థుల కన్నెర్ర

by Nallavelli.Anjaneyulu |

దిశ, నారాయణపేట క్రైమ్ : విద్యార్థులు ఆర్టీసీలో ఉద్యోగాలు అడగలేదు... తమ ప్రాంతాలకు వెళ్లడానికి బస్సు సౌకర్యం కల్పించాలని

డిపో మేనేజర్ నిర్లక్ష్యపు సమాధానం పై విద్యార్థుల కన్నెర్ర
X

దిశ, నారాయణపేట క్రైమ్ : విద్యార్థులు ఆర్టీసీలో ఉద్యోగాలు అడగలేదు... తమ ప్రాంతాలకు వెళ్లడానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరగా స్పష్టమైన సమాధానం రాలేదు. దీంతో గంటల తరబడి వేచి చూసిన విద్యార్థులు విసుగెత్తి రోడ్డుపై బైఠాయించారు. గంటకు పైగా విద్యార్థులు డిపో మేనేజర్ బయటకు రావాలని స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరగా డిపో మేనేజర్ నుంచి స్పందన కరువైందని విద్యార్థి సంఘాలు వాపోయారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సైతం డిపో మేనేజర్ ను బయటకు వచ్చి సమాధానం చెప్పాలని కోరగా ససేమిరా సమాధానం వచ్చింది. దీంతో మరింత కోపోద్రిక్తులైన విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులు గంటల తరబడి మహిళా విద్యార్థులు ఆందోళన చేస్తుంటే కనీసం జాలి కూడా లేకుండా డిపో మేనేజర్ మొండిగా ప్రవర్తించడం ఏమిటని... ఏ అధికారి పోద్బలంతో ఇంతగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది పూర్తి స్థాయి విచారణ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. పైగా బస్సు కావాలనీ విద్యార్థుల తరపున మాట్లాడితే కేసులు పెట్టండనీ హుకుం జారీ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కేసులకు బయటపడితే విద్యార్థి ఉద్యమాలు నడపలేమని విద్యార్థి సంఘం నాయకుడు హెచ్చరించారు. కొంతమంది మీడియా తరపున విషయాన్ని ఆర్టీసీ ఆర్ఎం దృష్టికి తీసుకెళ్ళగా డిపో మేనేజర్ ఎలా వస్తుందని...బస్సు కోసం విద్యార్థులు ఆందోళన చేయడం కరెక్ట్ కాదని చెప్పడం కొస మెరుపు. కాగ చివరకు బస్సు లను ఏర్పాటు చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Next Story