- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీ రిజర్వేషన్ల సాధనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది : మంత్రి జూపల్లి
దిశ, కల్వకుర్తి : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా రాష్ట్ర బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపుతో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం, కల్వకుర్తి, ఆమన్ గల్ లో

దిశ, కల్వకుర్తి : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా రాష్ట్ర బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపుతో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం, కల్వకుర్తి, ఆమన్ గల్ లో నిర్వహించిన బీసీ బంద్‌లో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ బంద్‌లో ఆయనతో పాటు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు లభించేలా చర్యలు తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్ఫూర్తితో, భారత్ జోడో యాత్రలో ఆయన ఇచ్చిన హామీ మేరకే తెలంగాణలో కుల గణనను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు దశలవారీ చర్యలు చేపట్టిందని చెప్పారు. కులగణన ఆధారంగా సమగ్ర నివేదిక సిద్ధం చేసి, అసెంబ్లీలో అన్ని పార్టీల మద్దతుతో బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపించినప్పటికీ, ఆరు నెలలు గడిచినా కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఇవ్వలేదని మంత్రి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 పై కొందరు హైకోర్టుకు వెళ్లగా.. తాత్కాలిక స్టే ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించిందని తెలిపారు.






