కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది: బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి

by Ratna Kumari |

ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఫల్యాలను, రైతుల సమస్యలను ఎండగట్టేందుకు బీజేపీ ఆధ్వర్యంలో "రైతు గోస - బీజేపీ భరోసా" కార్యక్రమం నిర్వహిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది:   బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, హన్వాడ : ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఫల్యాలను, రైతుల సమస్యలను ఎండగట్టేందుకు బీజేపీ ఆధ్వర్యంలో "రైతు గోస - బీజేపీ భరోసా" కార్యక్రమం నిర్వహిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీజేపీ మండల అధ్యక్షులు కొండా లింగన్న ఆధ్వర్యంలో 'రైతు గోస - బీజేపీ భరోసా' ధర్నా కార్యక్రమం బుధవారం హన్వాడ మండలకేంద్రం లో నిర్వహించారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ హన్వాడ ప్రధాన కూడలిలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. ​​బీజేపీ నాయకులు, కార్యకర్తలు చేతుల్లో ప్లకార్డులు, పార్టీ జెండాలు పట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి శాంతియుతంగా తమ నిరసనను వ్యక్తపరిచారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, రైతులకు రుణమాఫీ, మద్దతు ధర, సకాలంలో పెట్టుబడి సాయం అందించడంలో విఫలమైందని ఆయన మండిపడ్డారు. రైతుల కష్టాలు తీరే వరకు బీజేపీ వారి పక్షాన ఉండి పోరాటాలు కొనసాగిస్తుందని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అనంతరం ​మండల అధ్యక్షులు కొండ లింగన్న మాట్లాడుతూ హన్వాడ మండలంలోని రైతులు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో జిల్లా, మండల స్థాయి ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story