- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ జోరు.. లోకల్‌లో విజయమే లక్ష్యంగా దూకుడు
స్థానిక సంస్థల ఎన్నికలలో విజయమే లక్ష్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ ఇప్పటికే పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాల పేరుతో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ గెలిచే అభ్యర్థులను గుర్తించే పనిలో కాంగ్రెస్ నాయకత్వం ఉంది.

స్థానిక సంస్థల ఎన్నికలలో విజయమే లక్ష్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ ఇప్పటికే పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాల పేరుతో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ గెలిచే అభ్యర్థులను గుర్తించే పనిలో కాంగ్రెస్ నాయకత్వం ఉంది. మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్నా, ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్‌ఎస్, బీజేపీ ఇంకా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగలేదు. ఈ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో మండలాల వారీగా సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. బీఆర్‌ఎస్ మాజీలు, మాజీ మంత్రుల్లో మెజారిటీ మంది ఆచూకీ కనిపించకపోవడం ఆశావహుల్లో నిరాశకు దారితీసింది. ప్రతిపక్షాల తరఫున పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులలో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి. ప్రతిపక్ష పార్టీల మాజీ నాయకుల్లో ఒక ముఖ్య సందేహం నెలకొన్నది. గెలిపించిన అభ్యర్థులు అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయిస్తారేమోనని భయం వెంటాడుతోంది. ఫలితంగా, తమ శ్రమ, డబ్బు వృథా అవుతాయన్న ఆలోచనలో ప్రతిపక్ష నాయకత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో మాజీలు అధిష్టానం సలహాలు పాటిస్తూ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకుంటారా?, మొక్కుబడిగా వ్యవహరిస్తారా? అన్న అంశం తేలాల్సి ఉంది.
- దిశ, మహబూబ్ నగర్ బ్యూరో
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికలలో విజయమే లక్ష్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ అస్త్ర శాస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. కాగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీల నాయకులు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగడం లేదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కునేందుకు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటిస్తూ అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు, వివిధ కార్యక్రమాల పేర్లతో పర్యటనలు కొనసాగిస్తున్నారు. తమ తమ పరిధిలో ఉన్న ప్రతి మండలంలోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే విధంగా ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. ప్రతి గ్రామంలో పోటీ చేయవలసిన అభ్యర్థుల వివరాలను సేకరించి, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలతో పాటు ఆయా గ్రామాలలో ఉన్న పలువురు ప్రముఖుల నుండి కూడా వివరాలను సేకరించి గెలుపు గుర్రాలను రంగంలో దించే పనిలో ఉన్నారు. మొదటి విడత ఎన్నికలు జరిగే స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 27నుంచి ఆరంభమవుతున్న నేపథ్యంలో ముందుగా ఆయా గ్రామ సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లను ఎంపిక చేస్తూ ఉన్నారు.
ఇంకా రంగంలోకి దిగని ప్రతిపక్ష నేతలు...
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూలు విడుదలైనప్పటికిని ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల నాయకులు మండలాలు, గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. బీజేపీకి చెందిన ఎంపీడీకే అరుణ మాత్రం రోజువారీ కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ఎన్నికలకు సంబంధించి పలు సూచనలు సలహాలు చేస్తున్నా మిగతా నియోజకవర్గాలలో ఆ బాధ్యతలు చెప్పుకోదగిన స్థాయిలో లేకపోవడం కమలం పార్టీ మద్దతుతో పోటీ చేయాలని అనుకుంటున్నా వారు కలవరం చెందుతున్నారు. బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులలో కొందరు మాత్రమే ఎన్నికల నేపథ్యంలో తమ తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ నాయకులు, కార్యకర్తలతో సమాలోచనలు చేశారు. నియోజకవర్గాల్లో మెజారిటీ మాజీల ఆచూకీ కనిపించలేదు. దీంతో ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులుగా, వార్డు సభ్యులుగా పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల్లో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి.
గెలిపించినా... అధికార పార్టీలోకి పోతారేమోనని భయం...
పార్టీ అభ్యర్థులను నిర్ణయించి, వారిని పోటీ చేయించి గెలిపించినా వారు తమ పార్టీలో ఉంటారా? ఉండరా? అన్న సందేహాలు ప్రతిపక్ష పార్టీల మాజీల్లో వ్యక్తం అవుతున్నట్లు సమాచారం. ఎన్నికలు పార్టీలతో సంబంధం లేకుండా జరుగుతుండడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కారణంగా గెలిచినవారు అధికార పార్టీలో చేరితే పార్టీ పరిస్థితి దెబ్బతింటుంది. తమ శ్రమ, డబ్బులు వృథా అవుతాయన్న ఆలోచనలలో ప్రతిపక్ష నాయకులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీలు, ఇతర ముఖ్యమైన నాయకులు పార్టీల అధిష్టానం ఇచ్చే సలహాలు పాటిస్తూ అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకుంటారా? లేక మొక్కుబడిగా తీసుకుంటారా? అన్న అంశం మరో ఒకటి రెండు రోజుల్లో తేలనుంది.






