గుండప్ప అంత్యక్రియల్లో మిత్రుల సంతాపం.. కుటుంబానికి ఆర్థిక సహాయం

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-11-04 16:11:18  IST  )

దిశ, మహమ్మదాబాద్/గండీడ్ : గండీడ్ మండల కేంద్రానికి చెందిన కుమ్మరి గుండప్ప ప‌దో త‌ర‌గ‌తి 1999-2000 బ్యాచ్. జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల గండీడ్ లో చ‌దువుకున్న త‌న తోటి స్నేహితుడు

గుండప్ప అంత్యక్రియల్లో మిత్రుల సంతాపం.. కుటుంబానికి ఆర్థిక సహాయం
X

దిశ, మహమ్మదాబాద్/గండీడ్ : గండీడ్ మండల కేంద్రానికి చెందిన కుమ్మరి గుండప్ప ప‌దో త‌ర‌గ‌తి 1999-2000 బ్యాచ్. జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల గండీడ్ లో చ‌దువుకున్న త‌న తోటి స్నేహితుడు గుండ‌ప్ప మ‌ర‌ణ వార్త తెలుసుకున్న స్నేహితులు మంగ‌ళ‌వారం పార్థివ దేహాన్ని సంద‌ర్శించి నివాళుల‌ర్పించారు. ఈ సందర్భంగా మిత్రులు ఐక్యంగా ముందుకు వచ్చి గుండప్ప కుటుంబానికి ఖర్చుల నిమిత్తం రూ.39,000 చిన్న సహాయం అందజేశారు. కార్యక్రమంలో గుముడాల చెన్నయ్య, బి. రాములు, ఆర్. జనార్ధన్ రెడ్డి, సి. శ్రీకాంత్, సాజిత్, మహేందర్, రవి, నర్సిములు, వెంకటయ్య, శంకర్, సురేందర్, గంగాధర్ రెడ్డి, శ్రీనివాసులు, కేశవులు, ఎల్లప్ప పాల్గొన్నారు.

Next Story