- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరాడంబరం, నిజాయితీకి నిదర్శనం కామ్రేడ్ వరగంటి ఈశ్వర్ : సీపీఎం రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి
దిశ, వనపర్తి : నిరాడంబరం, నిజాయితీకి నిదర్శనం కామ్రేడ్ వరగంటి ఈశ్వర్ అని సీపీఎం రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం సీపీఎం పట్టణ కార్యదర్శి పరమేశ్వర చారి అధ్యక్షతన,

దిశ, వనపర్తి : నిరాడంబరం, నిజాయితీకి నిదర్శనం కామ్రేడ్ వరగంటి ఈశ్వర్ అని సీపీఎం రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం సీపీఎం పట్టణ కార్యదర్శి పరమేశ్వర చారి అధ్యక్షతన,వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ అమరజీవి వనగంటి ఈశ్వర్ 5వ కామ్రేడ్ వరగంటి ఈశ్వర్ ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి సిపిఎం రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి. జబ్బార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వనగంటి ఈశ్వర్ సీపీఎం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శిగా 23 సంవత్సరాలు పని చేశారని గుర్తు చేశారు. వనపర్తి లో ఉద్యమం ప్రారంభించి.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా సీపీఎంను విస్తరించారని, నిరాడంబరంగా, నిజాయితీగా పనిచేశారన్నారు. వనపర్తి పట్టణంలో అనేక కార్మిక సంఘాలను ఏర్పాటు చేసి కార్మిక వర్గ హక్కుల సాధన కోసం ఉద్యమించారన్నారు. 1995లో పార్టీ పిలుపు మేరకు శాసనోల్లంఘన ఉద్యమంలో పోలీస్ లాఠీ చార్జికి గురయ్యారని, సమరశీల పోరాటాలకు నాయకత్వం వహించారని కొనియాడారు.
సామాజిక న్యాయం కోసం, మతసామరస్యం కోసం, సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా అనేక సమశీల ఉద్యమాలు నేర్పించారని, విద్యుత్ పోరాటంలో కీలక పాత్ర పోషించారని వివరించారు. భూ సమస్య పరిష్కారం కోసం కృషి చేశారన్నారు. జిల్లాలో వచ్చిన కరువు సందర్భంగా అనేక గ్రామాలలో అంబలి కేంద్రాలు ఏర్పాటు చేసి అంబలి కేంద్రాలు నిర్వహించారన్నారు.కరువు లో లోపెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో ఒక ఆకలి చావు జరిగితే పెద్ద ఎత్తున ఉద్యమించి ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును గుమ్మడం గ్రామానికి రప్పించారని అనేక మందికి కరువు పింఛన్లు సాధించారని తెలిపారు. రైతులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులుగా పనిచేశారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. రాజు, డి. బాల్ రెడ్డి, సీపీఎం నాయకులు డి.కురుమయ్య, నందిమల్ల రాములు, సి పుల్లయ్య,గంధం మదన్, గంధం గట్టన్న, బీసన్న, సాయి లీల, ఉమా,జి. మన్యం, డి.బాలరాజు, జి. బాలస్వామి, జి. బాలరాజు,దాసరి పెంటయ్య,చుక్క పెంటయ్య, బి.కురుమయ్య పాల్గొన్నారు.






