- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అచ్చంపేట ఆర్డీఓ మాధవి పై HRC లో ఫిర్యాదు
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం ఐనోలు గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వర రెడ్డి సోమవారం మానవ హక్కుల కమిషన్ లో అచ్చంపేట ఆర్డీవో మాధవి పై ఫిర్యాదు చేశారు.

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం ఐనోలు గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వర రెడ్డి సోమవారం మానవ హక్కుల కమిషన్ లో అచ్చంపేట ఆర్డీవో మాధవి పై ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో నేను ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నారని మా గ్రామంలో మా పేరా ఉన్న పట్టా భూమి అన్యాక్రాంతం అవుతున్న విషయంపై స్థానిక రెవెన్యూ అధికారులకు ఆర్జీ పెట్టుకున్నామని.. కానీ అవినీతికి తెరలేపుతున్న అధికారులపై కోర్టులో ఫిర్యాదు చేశామని ప్రతి కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే గత ఏడాది నుంచి రాజకీయ నాయకులు అండదండలతో మాతో పాటు ఇతర రైతులను కూడా వేధింపులకు గురి చేస్తూ ఆత్మహత్య చేసుకునే విధంగా ఆర్డీఓ వ్యవహరిస్తుందని ఆ లేఖలో ఆరోపించారు. వారి నుంచి మమ్ములను కాపాడాలని మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేశామని బాధితుడు వెంకటేశ్వర రెడ్డి మీడియాకు తెలిపారు. అచ్చంపేట ఆర్డీవో మాధవిని దిశా ఫోన్ ద్వారా వివరణ కోరెందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆమె అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.






