సీనియర్ సిటిజన్ ఫోరం సేవలతో సమాజం ప్రభావితమవుతుంది : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

by Ratna Kumari |

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి : సీనియర్ సిటిజన్ ఫోరం సేవలతో సమాజం ప్రభావితం అవుతుందని, ఫోరం సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్

సీనియర్ సిటిజన్ ఫోరం సేవలతో సమాజం ప్రభావితమవుతుంది : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
X

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి : సీనియర్ సిటిజన్ ఫోరం సేవలతో సమాజం ప్రభావితం అవుతుందని, ఫోరం సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పది లక్షల మున్సిపల్ నిధులతో నిర్మించిన సీనియర్ సిటిజన్ ఫోరం నూతన సమావేశ మందిరాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి ప్రసంగించారు. సమాజానికి మీ అనుభవం ఎంతో అవసరమని, సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం తాను పనిచేస్తానని, ఫోరంలో పది వేల సభ్యుల టార్గెట్ పూర్తి చేస్తే కోటి రూపాయలు ఫండ్ ఫోరం కు అందజేస్తానని హామి ఇచ్చారు. మీ చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళితే 25 శాతం రాయితీ ఇచ్చే విధంగా ఆసుపత్రుల యాజమాన్యాలతో మాట్లాడి ఒప్పిస్తానని చెప్పారు. సీనియర్ సిటిజన్స్ కోసం ఒక అధునాతన గ్రంథాలయాన్ని త్వరలో ఏర్పాటు చేస్తానని, రాజకీయాలకు అతీతంగా సమాజానికి ఉపయోగపడే నీతిమంతులనే ఈ ఫోరంలో సభ్యులుగా చేర్చుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మార్కెట్ కమిటీ చైర్మెన్ బెక్కెరి అనిత, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, వినోద్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షులు జగపతిరావు, ఉపాధ్యక్షులు రాజసింహుడు, కార్యదర్శి నాగభూషణం, సభ్యులు సూర్య నారాయణ, గంగాధర్, జి.నాగభూషణం, బాలకృష్ణ , రాములు, సరోజమ్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల వెంకటేష్, గంజి వెంకట్రాములు, ప్రశాంత్, వర్థ రవి ఏఇ రాఘవినతి, వర్క్ ఇన్స్పెక్టర్ నరహరి పాల్గొన్నారు.

Next Story