- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన కలెక్టర్ కోయ శ్రీ హర్ష..
దిశ, ప్రతినిధి నారాయణపేట : అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన వేడుకలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే నారాయణపేట మండలం బైరంకొండ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు.
అంబేద్కర్ కు నివాళులు అర్పించిన కలెక్టర్..
స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ కోయ శ్రీ హర్ష పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే పీఆర్టీయూ టీఎస్, తపస్, బీజేపీ, అంబేద్కర్ సంక్షేమ సంఘం, పట్టణ మోచి సంఘం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, టీడీపీ, మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మోసటి జ్యోతి, మున్సిపల్ చైర్ పర్సన్ గందే అనసూయ, ఎంపీపీ అమ్మ కోళ్ల శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వేపూరి రాములు, శేర్ కృష్ణారెడ్డి, యాదగిరి జనార్దన్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు పగడాకుల శ్రీనివాసులు, కొండా సత్యా యాదవ్, సత్య రఘుపాల్ తదితరులు పాల్గొన్నారు.