- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ద్విచక్ర వాహనం పై క్షేత్రస్థాయిలో భూభారతి దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్
భూభారతి సమస్యల పరిష్కారం కోసం చేసుకున్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా విచారించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ బీ.ఎం. సంతోష్ ఆదేశించారు.

- రైతుల సమస్యలను తెలుసుకున్న కలెక్టర్ బీఎం సంతోష్
- ఎటువంటి సందేహాలకు తావు లేకుండా పరిష్కరించాలి
దిశ, కేటీ దొడ్డి : భూభారతి సమస్యల పరిష్కారం కోసం చేసుకున్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా విచారించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ బీ.ఎం. సంతోష్ ఆదేశించారు. మంగళవారం కేటిదొడ్డి మండలం పాగుంట గ్రామ శివారులోని 103 సర్వే నంబర్‌లో భూభారతి కింద పట్టా భూములు నిషేధిత భూముల జాబితాలో ఉండటంతో ఏర్పడిన సమస్యపై దరఖాస్తు చేసుకున్న స్థానిక రైతులను కలెక్టర్ ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా గ్రామంలో దారి సరిగా లేకపోవడం వల్ల బైక్‌పై వ్యవసాయ భూముల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సంబంధిత భూముల పూర్వ రికార్డులు, సర్వే వివరాలు, డాక్యుమెంట్లను సమగ్రంగా కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి రూల్స్, రెగ్యులేషన్స్ ప్రకారం.. నిషేధిత భూములపై వచ్చిన ప్రతి దరఖాస్తును పూర్వపు రికార్డులు, సర్వే డాక్యుమెంట్లు, ఫీల్డ్ సర్వే ఆధారంగా పారదర్శకంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి దరఖాస్తును న్యాయపరమైన విధానంతో, పారదర్శకంగా,ఎటువంటి సందేహాలకు తావు లేకుండా పరిష్కరించాలని స్పష్టం చేశారు. అనంతరం కేటిదొడ్డి మండలం, కేటీదొడ్డి గ్రామంలోని 67 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిని కలెక్టర్ ద్విచక్ర వాహనంపై వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దరఖాస్తులో ఉన్న మిస్సింగ్ సర్వే నంబర్లను ఫీల్డ్‌లో స్వయంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ హరికృష్ణ, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.






