- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు : కలెక్టర్ సంతోష్
దిశ, కందనూల్ : విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ ఉద్యోగులను హెచ్చరించారు. నాగర్ కర్నూల్ ఆర్డీఓ కార్యాలయాన్ని

దిశ, కందనూల్ : విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ ఉద్యోగులను హెచ్చరించారు. నాగర్ కర్నూల్ ఆర్డీఓ కార్యాలయాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఉద్యోగుల హాజరు, సమయపాలన, బయోమెట్రిక్ అటెండెన్స్ వ్యవస్థను పరిశీలించారు. విధుల్లోకి సమయానికి హాజరు కాని ఉద్యోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు ప్రజలకు వేగవంతంగా, నిష్పాక్షికంగా అందించాలనే లక్ష్యంతో ప్రతి శాఖలో సమర్థత పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల పిటిషన్లు, దరఖాస్తులు, భూమి సంబంధిత వివాదాలు సకాలంలో పరిష్కారమవుతున్నాయా అని తెలుసుకున్నారు. ప్రజలకు సకాలంలో సేవలు అందించడం అధికారులు, ఉద్యోగుల బాధ్యత అని అన్నారు.
ప్రతి రెవెన్యూ విభాగం చురుకుగా ఉండాలని సూచించారు. రెవెన్యూ విభాగం పరిధిలోని ప్రభుత్వ భూముల రికార్డులు, భూ భారతిలో నమోదైన దరఖాస్తుల స్థితి, పట్టాదారుల వివరాలును కూడా కలెక్టర్ సమీక్షించారు. రికార్డులు ఖచ్చితంగా, పారదర్శకంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. భూములపై వివాదాలు తలెత్తకుండా చూసుకోవాలని, డిజిటల్ రికార్డుల్లో లోపాలు ఉన్నచో వెంటనే సరిదిద్దాలని సూచించారు. బిజినేపల్లి, తాడూరు, తిమ్మాజిపేట, తెలకపల్లి, నాగర్ కర్నూల్ మండలాల పరిధిలోని ప్రభుత్వ భూముల వివరాలును కూడా పరిశీలించారు. భూ వివాదాల పరిష్కారం వేగవంతం చేసి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మండల రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.






