నీట్ ఫ‌లితాల్లో MBBS సీటు సాధించిన చ‌ర్మ‌కారుడి కూతురు

by Nallavelli.Anjaneyulu |

దిశ, మల్దకల్ : జోగులాంబ గద్వాల జిల్లా మ‌ల్ద‌కల్ మండ‌లం బిజ్వారం గ్రామానికి చెందిన రాజానందం, శాంతమ్మ దంపతుల కూతురు ఎస్.హెమీమ

నీట్ ఫ‌లితాల్లో MBBS సీటు సాధించిన చ‌ర్మ‌కారుడి కూతురు
X

దిశ, మల్దకల్ : జోగులాంబ గద్వాల జిల్లా మ‌ల్ద‌కల్ మండ‌లం బిజ్వారం గ్రామానికి చెందిన రాజానందం, శాంతమ్మ దంపతుల కూతురు ఎస్.హెమీమ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెలువడించిన నీటి పరీక్ష ఫలితాలలో ప్రభుత్వ కోటాలో కరీంనగర్ జిల్లా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ సాధించింది. విద్యార్థిని ఎస్. హెమీమ విద్యాభ్యాసం మొత్తం కూడా కొత్తకోట, నాంచార్, గౌలి దొడ్డి ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ గురుకుల కళాశాలలో చదివి ఎంబీబీఎస్ సీటు సాధించడం అందరికీ ఆదర్శనీయం. త‌ల్లిదండ్రుల జీవనోపాధి కష్టాన్నే నమ్ముకొని చెప్పులు తయారు చేస్తూ పెబ్బేర్, దేవరకద్ర, కొత్తకోట, రకరకాల ప్రాంతాలలోని ఎండకు, వానకు తడుస్తూ సంతలలో చెప్పులు అమ్ముతూ వచ్చిన పైసలతో కూతురిని చదివించి డాక్టర్ స్థాయిలో తీర్చి దిద్దిన తల్లిదండ్రులు రాజానందం,శాంతమ్మ దంపతుల శ్రమ అందరికీ ఆద‌ర్శం. ఈ సందర్భంగా విద్యార్థిని హెమీమ మాట్లాడుతూ ప్రభుత్వ కోటాలో ఎంబీబీఎస్ సీటు రావడం ఆనందంగా ఉందని అన్నారు. నాన్న ఆశయం నేను ఉన్నతమైన డాక్టర్ ని కావాలని చిరకాల కోరిక అని తెలిపారు. అలాంటిది ఎంబిబిఎస్ కోర్సు పూర్తి చేసి మాలాంటి పేద ప్రజలకు వైద్యం అందించేందుకు కృషి చేస్తానన్నారు. అలాగే ప్రతి విద్యార్థిని విద్యార్థులు కూడా సమయాన్ని వృధా చేయకుండా తల్లిదండ్రుల కష్టాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదువుకొని ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని కోరారు.

Next Story