- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూన్ 4, 5 తేదీల్లో సీఎం రేవంత్ పర్యటన
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు ప్రత్యేక హెలికాప్టర్ లో ఈనెల నాలుగో తేదీన జిల్లాకు రానున్నారు. ముందుగా మక్తల్ నియోజకవర్గానికి చేరుకొని అక్కడ నూతనంగా చేపట్టిన మక్తల్.. నారాయణపేట.. కొడంగల్ ఎత్తిపోతల పనుల పరిస్థితులు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణానదిపై నిర్మించ తలపెట్టిన బ్యారేజీల స్థితిగతులను చూసి జూరాల వద్దకు చేరుకుంటారు.
అక్కడ జూరాల స్థితిగతులను ముఖ్యమంత్రి స్వయంగా చూస్తారు. వీటితో పాటు మరికొన్ని ఎత్తిపోతలు, ప్రాజెక్టులకు సంబంధించి అధికారులను అడిగి తెలుసుకుంటారు. నాలుగో తేదీ రాత్రి కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల కు చేరుకొని అక్కడే బసత్ చేసే అవకాశం ఉంది. 05వ తేదీన పాలమూరు.. రంగారెడ్డి ప్రాజెక్టుల్లో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లను పరిశీలిస్తారు. ఈ సందర్భంగా బహిరంగ సభను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారు అయిన నేపథ్యంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆదివారం భూత్పూర్ మండలం కరివేన రిజర్వాయర్ ను ఇరిగేషన్ సీఈలు సత్యనారాయణ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి తదితర అధికారులతో కలిసి పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను జయప్రదం చేసేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని జీఎంఆర్ తెలిపారు.






