- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పింఛన్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం
రాష్ట్రంలో ఆసరా పింఛన్ల పెంపు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు.

పింఛన్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం
ఇప్పటికైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
ప్రభుత్వం కళ్లు తెరిచేలా త్వరలో భారీ స్థాయిలో ఉద్యమం
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
దిశ, మక్తల్: రాష్ట్రంలో ఆసరా పింఛన్ల పెంపు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. గురువారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో నియోజకవర్గ పింఛన్‌దారుల సన్నాహక సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. పక్క రాష్ట్రాల్లో వికలాంగుల పింఛన్లు పెంచినప్పటికీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఇచ్చిన హామీ అమలు చేయలేదని విమర్శించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజునుంచే వికలాంగులకు రూ.6 వేల పింఛన్, వృద్ధులకు రూ.4 వేల పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ అమలు కాలేదని ఆయన అన్నారు. కొత్తగా దరఖాస్తు చేసిన 10 లక్షల మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేస్తూ, మొత్తం 40 లక్షల మందికి లబ్ధి చేకూరుస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చెప్పిందని గుర్తుచేశారు. కానీ ఇప్పటికీ ఆ వాగ్దానాలు అమలు కాని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. నవంబర్‌లో "చలో హైదరాబాద్ మహా గర్జన" నిర్వహించి, పాలక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించేందుకు భారీ స్థాయిలో ఉద్యమం చేపడతామని మందకృష్ణ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు జి.నగేష్, జ్ఞానప్రకాశ్, జగ్గలి అంజప్ప, వెంకటేష్ తదితరులు, నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.






