- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు మార్లపాడు తండాకు సీఎం రేవంత్ రెడ్డి రాక
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లో మొంథా ఎఫెక్ట్ ప్రభావంతో అతి భారీ వర్షం కురవడం వల్ల పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని అందుకు ప్రభుత్వ పరంగా తగిన ఆర్థిక సాయం చేసి రై

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లో మొంథా ఎఫెక్ట్ ప్రభావంతో అతి భారీ వర్షం కురవడం వల్ల పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని అందుకు ప్రభుత్వ పరంగా తగిన ఆర్థిక సాయం చేసి రైతన్న ప్రజలను ఆదుకోవాలని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి వివరించారు. అందుకు సంబంధించి ఎమ్మెల్యే మాట్లాడారు. తుఫాన్ కారణంగా అచ్చంపేట నియోజకవర్గంలో ప్రాంతాల్లో జరిగిన నష్టం పై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మర్లపాడు తాండ గ్రామాన్ని, అలాగే నష్టపోయిన ప్రాంతాలను ఏరియల్ సర్వే చేసి అనంతరం అక్కడే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారని ఎమ్మెల్యే తెలిపారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (నక్కలగండి ) జలాశయంలో పరిధిలో ఉన్న మార్లపాడు తండా పూర్తిగా ముంపునకు గురైందనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. అందుకు సీఎం స్పందిస్తూ..అచ్చంపేట నియోజకవర్గంలో వరద ప్రాంతాల్లో నష్టంపై నివేదిక ప్రణాళికలు సిద్ధం చేసి త్వరగా అధికారుల ద్వారా పంపించాలని సూచించారనీ పేర్కొన్నారు. తుఫాను నష్ట ప్రభావం పై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి అచ్చంపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇదే
సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు చేరుకొని అక్కడి నుంచి మధ్యాహ్నం 1:10 గంటలకు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నె వారిపల్లి SLBC టన్నెల్ -1 వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1: 15 గంటల నుంచి 1:25 గంటల వరకు అచ్చంపేట నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం 1: 25 గంటల ఎంజిఆర్ఐ డైరెక్టర్ చీఫ్ సైంటిస్ట్ స్వాగతం పలుకుతారు. అనంతరం 2 గంటల వరకు విద్యుత్ అయస్కాంత లోపును సందర్శిస్తారు. అలాగే హెలికాప్టర్ సర్వే డేటా సమర్పార్జన వ్యవస్థను సందర్శిస్తారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి, ఎంజీఆర్ఐ డైరెక్టర్ తో కలిసి సర్వే వివరాలను మీడియాతో పంచుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2:30 గంటలకు హెలికాప్టర్ ద్వారా తిరుగు ప్రయాణం అవుతూ సాయంత్రం 3:10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.






