CM Revanth Reddy : ‘విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి’

by Chintha Aamani |

విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదువుతూ.. ఉన్నత లక్ష్యాలను

CM Revanth Reddy : ‘విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి’
X

దిశ, జడ్చర్ల: విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదువుతూ.. ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. శుక్రవారం హైదరాబాద్ లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో సమకూరుస్తున్న సర్కారు బడులు, కళాశాలల 27 వేల మంది విద్యార్థులకు షూ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని, సర్కారు బడులు, కళాశాలలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల విద్యార్థులు దాదాపుగా 27,000 మందికి షూస్ పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యే ముందుకు రావడం అభినందనీయం అన్నారు. కష్టపడి చదువుకునే విద్యార్థులకు సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లడించారు. కార్యక్రమంలో మహబూబ్ నగర్ డీఈవో రవీందర్, నాగర్ కర్నూల్ డీఈవో గోవిందరాజులు, జడ్చర్ల మండల ఎంఈఓ మంజుల, కమ్యూనిటీ మొబిలైజషన్ అధికారి బైకని బాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story