- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాతీయ వాలీబాల్ ప్లేయర్ అనన్య శ్రీని అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
దిశ, మక్తల్ : మక్తల్ ప్రాంతానికి చెందిన జాతీయ వాలీబాల్ ప్లేయర్ పుల్లారి అనన్య శ్రీ ని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. మంగళవారం జూబ్లీహిల్స్ లో ఆయన నివాసంలో

దిశ, మక్తల్ : మక్తల్ ప్రాంతానికి చెందిన జాతీయ వాలీబాల్ ప్లేయర్ పుల్లారి అనన్య శ్రీ ని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. మంగళవారం జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో క్రీడానివాసంలో క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి అనన్య శ్రీని శాలువతో సత్కరించారు. అనంతరం అనన్యకి అభినందనలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా అనన్య సాధించిన సీనియర్ నేషనల్ గోడ్ల్ మెడల్, ఎఫ్ఐయూ వరల్డ్ యూనివర్సిటీ మెడల్స్ ని సీఎం రేవంత్ రెడ్డికి చూపించారు అనన్య. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ అనన్య కుటుంబ సభ్యులు పుల్లారి ఆనంద్, వరలక్ష్మీ, ఆదిత్య, సౌందర్య పాల్గొన్నారు.






