- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గద్వాల ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కుమారుడు సాయి సాకేత్ రెడ్డి, ఐశ్వర్వల వివాహానికి శనివారం సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరయ్యారు.

దిశ, గద్వాల కలెక్టరేట్ : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కుమారుడు సాయి సాకేత్ రెడ్డి, ఐశ్వర్వల వివాహానికి శనివారం సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఉదయం నుంచే హెలిపాడ్ నుంచి కళ్యాణ వేదిక వద్దకు చేరుకునే మార్గంలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హెలిక్యాప్టర్ లో గద్వాలకు చేరుకున్నారు. కలెక్టరేట్ సమీపంలో ఉన్న హెలిపాడ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డికి జోగులాంబ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, పలువురు ప్రజా ప్రతినిధులు పుష్పగుచ్చాలు, మొక్కలు అందజేశారు. శాలువాలతో సన్మానం చేసి స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి కళ్యాణ వేదిక వద్దకు చేరుకోగానే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పలువురు నాయకులు సాదరంగా స్వాగతం పలికారు. ఇంటిలిజెన్సీ అధికారులు, పోలీస్ బందోబస్తుతో కళ్యాణ వేదిక పైకి చేరుకున్న ముఖ్యమంత్రి నూతన దంపతులకు పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వధూవరులు సీఎం ఆశీర్వాదం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రాకతో వివాహానికి వచ్చిన అశేష జనం సందడి చేయగా సీఎం రేవంత్ రెడ్డి వారికి అభివాదం చేస్తూ నమస్కరించారు. అనంతరం కల్యాణ వేదిక పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంట్ హౌస్ లో సీఎంతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పెళ్లి విందు ఆరగించారు. భోజనం అనంతరం తిరిగి హెలిపాడ్ వద్దకు చేరుకున్న సీఎంకు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మత్స్య, పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యుడు మల్లు రవి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజా ప్రతినిధులు, జోగులాంబ జోన్ డిఐజి ఎల్. ఎస్. చౌహన్, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పి శ్రీనివాసరావు, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.






