- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మక్తల్ నియోజకవర్గం అభివృద్ధి పై సీఎం కు మక్కువ ఎక్కువ : మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్ నియోజకవర్గం అభివృద్ధి పై సీఎం రేవంత్ రెడ్డికి మక్కువ ఎక్కువ అని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు

దిశ, మక్తల్ : రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మక్తల్ నియోజకవర్గంలో పుష్కలమైన జలాలు పాడిపంటలు పంటలు పండించే శ్రమజీవులు భూములు అందుబాటులో ఉన్న పాలకుల నిర్లక్ష్యం వల్ల వలస ప్రాంతంగా పేరుంది. దాన్ని తుడిచి పెట్టాలంటే మక్తల్ నియోజకవర్గాన్ని సస్య శ్యామలం చేయడమే తన ధ్యేయమన్నారు రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, రైతులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 04 పర్యటనపై ఏరియల్ సర్వే, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ల్లో బ్యారేజీలు నిర్మించడం ద్వారా జిల్లాకు సాగు, తాగు నీటి సమస్య తీర్చవచ్చని తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో 51 శాతం భూభాగం తెలంగాణకు, 49 శాతం కర్ణాటకకు ఉండటంతో రెండు రాష్ట్రాలకు సమాన ప్రయోజనం కలిగే విధంగా రూపకల్పన చేసినట్లు చెప్పారు. తెలంగాణ వాటా నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు.
కృష్ణా నది పై కొల్పూర్-కొర్తికొండ వద్ద1.8 టీఎంసీ, మురారి దొడ్డి - గంజి పల్లి, దేవసూగురు వద్ద బ్రిడ్జి కం బారేజ్ లకు అలాగే భీమా నది పై సుగూరు, కుసుముర్తి వద్ద బ్రిడ్జి కం బారేజీల నిర్మాణానికి రెండు రాష్ట్రాల మంత్రులు అధికార్లు నిధుల మంజూరు పాలనపరమైన ఒప్పందానికి వచ్చారని తెలిపారు. నర్వ మండలంలోని జంగంరెడ్డిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ప్రభుత్వం175 కోట్లు మంజూరయ్యాయని, ఈ పథకం ద్వారా13 గ్రామాల్లోని సుమారు 7,500 ఎకరాలకు సాగునీరు అందనుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏరియల్ సర్వేలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కర్ణాటక రాష్ట్ర ప్రతినిధులతో కలిసి జూన్ 4, 5 తేదీల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కీలక సాగునీటి ప్రాజెక్ట్ లపై సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. 5 వేల కోట్లతో మక్తల్నా-రాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నామన్నారు. సీఎం ఏరియల్ సర్వే సందర్బంగా ఆయా పరిధిలో ఉన్న మండలాల్లోని రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సీఎం రేవంత్ రెడ్డిని స్వాగతిస్తూ పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి విజ్ఞప్తి చేశారు.






