- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి సీఎం గ్రీన్ సిగ్నల్..
జోగులాంబ గద్వాల అలంపూర్ నియోజకవర్గంలో మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణానికి త్వరలో నివేదికను తయారు చేసి ప్రతిపాదనలు పంపాలని సీఎం కేసీఆర్, కార్యదర్శి స్మితా సబర్వాల్ ను ఆదేశించినట్లు ఎమ్మెల్యే అబ్రహం తెలిపారు.

దిశ, ఉండవల్లి : జోగులాంబ గద్వాల అలంపూర్ నియోజకవర్గంలో మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణానికి త్వరలో నివేదికను తయారు చేసి ప్రతిపాదనలు పంపాలని సీఎం కేసీఆర్, కార్యదర్శి స్మితా సబర్వాల్ ను ఆదేశించినట్లు ఎమ్మెల్యే అబ్రహం తెలిపారు. ఎమ్మెల్యే అబ్రహం శుక్రవారం హైదరాబాద్ ప్రగతి భవన్ లో జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, జిల్లా ఇంచార్జి ఎమ్మెల్సీ రవీందర్ రావు తో కలిసి సీఎం కేసీఆర్ మర్యాద పూర్వకంగా కలిశారు.
అనంతరం ఎర్రవల్లి ను నూతన మండలంగా ఏర్పాటు చేసినందుకు సీఎం కు ఎమ్మెల్యే అబ్రహం కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అబ్రహంకు సీఎం పూల బొకే ఇచ్చి శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని సీఎంని కోరగా అందుకు సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వీరి వెంట బీఆర్ఎస్ రాష్ట్ర యువనాయకులు అజయ్ ఉన్నారు.






