- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం కప్ క్రీడలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి : అదనపు కలెక్టర్ నర్సింగ రావు
తెలంగాణ సీఎం కప్ - 2025-26 క్రీడలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నర్సింగ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

దిశ, గద్వాల కలెక్టరేట్ : తెలంగాణ సీఎం కప్ - 2025-26 క్రీడలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నర్సింగ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడిఓసి సమావేశం హాలులో సీఎం కప్-2025-26 పోటీలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... గ్రామ, మండల, జిల్లా స్థాయిలో క్రీడలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అన్నారు. మండల స్థాయిలో ఎంపిడిఓ, తహశీల్దార్, ఎంఈఓ, పీఈటీలు క్రీడలను నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రధానోపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించి,ఒక కమిటీని ఏర్పాటు చేయాలనీ సూచించారు.సీఎం కప్-2025-26 షెడ్యూల్ ప్రకారం,గ్రామ పంచాయతీ స్థాయి పోటీలు జనవరి 17 నుండి 22 వరకు, మండల స్థాయి/ మునిసిపాలిటీ స్థాయి పోటీలు జనవరి 28 నుండి 31 వరకు,అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి పోటీలు ఫిబ్రవరి 3 నుండి 5 వరకు, జిల్లా స్థాయి పోటీలు ఫిబ్రవరి 9 నుండి 12 వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఫిబ్రవరి 20 నుండి 23 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతుందని తెలిపారు.
జిల్లాలో సి.యం కప్ 2025-26 క్రీడలలో భాగంగా గ్రామ పంచాయతీ క్లస్టర్ స్థాయిలో జనవరి 21 నుంచి 22, 2026 వరకు గద్వాల,ఆలంపూర్ నియోజకవర్గాలలో సీఎం కప్–2025-26 క్రీడలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి దశలో జనవరి 21న గద్వాల నియోజకవర్గంలోని గట్టు, కె.టి.దొడ్డి, మల్దకల్ మండలాలలోను,ఆలంపూర్ నియోజకవర్గంలోని అయిజ, వడ్డేపల్లి,రాజోలి,మానపాడు మండలాలలోను క్రీడలు జరుగుతాయని తెలిపారు.రెండవ దశలో జనవరి 22న గద్వాల నియోజకవర్గంలోని గద్వాల, ధరూర్ మండలాలలోను, ఆలంపూర్ నియోజకవర్గంలోని ఆలంపూర్,ఉండవెల్లి,ఇటిక్యాల, ఎర్రవల్లి మండలాలలోను క్రీడలు నిర్వహించబడతాయని తెలిపారు. ఈ క్రీడల నిర్వహణలో క్లస్టర్ ఇన్‌చార్జీలు,పీడీలు,పీఈటీలు, పీటీఐలు సమన్వయంతో పనిచేసి క్రీడలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల్లో క్రీడా ఆసక్తి పెంచడానికి పెద్ద ఎత్తున క్రీడలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.ప్రతి క్రీడాకారుడు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్‌లైన్ కాపీతో పాటు ఆధార్ జిరాక్స్ తీసుకురావాలని,రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రీడాంశంలోనే పాల్గొనాలని తెలిపారు.మరిన్ని వివరాల కోసం జిల్లా యువజన క్రీడల అధికారి కార్యాలయం ఫోన్ నెంబర్లు 9885479896, 9441590842, 9603996900 ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా క్రీడా అధికారి కృష్ణయ్య, ఎంపిడిఓ లు, ఏంఈఓ లు, పీఈటి లు పాల్గొన్నారు.






