- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిల్లలమర్రి బాలోత్సవం వేడుకలు వాయిదా
దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి : ఈ నెల 19, 20 తేదీల్లో జిల్లా కేంద్రంలో జరగవలసిన 'పిల్లలమర్రి బాలోత్సవం' 4 వ పిల్లల

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి : ఈ నెల 19, 20 తేదీల్లో జిల్లా కేంద్రంలో జరగవలసిన 'పిల్లలమర్రి బాలోత్సవం' 4 వ పిల్లల జాతర కార్యక్రమాన్ని, స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా జనవరి 5, 6 తేదీలకు వాయిదా వేసినట్లు అధ్యక్షుడు బెక్కెం జనార్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక సుసృత హస్పేటల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పిల్లల చదువుతో పాటు ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల వలన వారిలో మానసిక ఉల్లాసం, మనో విజ్ఞానం కోసం ఒక వేదిక అవసరమని భావించి 'పిల్లలమర్రి బాలోత్సవం' వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఉత్సవంలో 37 రకాల ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు, ఈ ఉత్సవంలో పాల్గొనే పాఠశాలలు జనవరి 2 లోపు ఆన్ లైన్ గుగూల్ ఫారం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరాంజనేయులు తెలిపారు. ఈ సమావేశంలో గౌరవం సలహాదారు జగపతిరావు, కోశాధికారి ప్రమోద్ పాల్గొన్నారు.






