లంక గ్రామాన్ని తలపిస్తోన్న చంద్రాయ‌న్ ప‌ల్లి

by Ratna Kumari |

దిశ, చారకొండ : మొంథా తుఫాన్ కార‌ణంగా జిల్లా వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా భారీ వ‌ర్షాల కార‌ణంగా చార‌కొండ‌ మండ‌ల ప‌రిధిలోని చంద్రాయన్ పల్లి నుండి - చారకొండ వెళ్లే

లంక గ్రామాన్ని తలపిస్తోన్న చంద్రాయ‌న్ ప‌ల్లి
X

దిశ, చారకొండ : మొంథా తుఫాన్ కార‌ణంగా జిల్లా వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా భారీ వ‌ర్షాల కార‌ణంగా చార‌కొండ‌ మండ‌ల ప‌రిధిలోని చంద్రాయన్ పల్లి నుండి - చారకొండ వెళ్లే దారిలో దేవునమ్మ బండ దగ్గర లోతట్టు బ్రిడ్జి ఉండ‌టంతో వర్షం నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రోడ్డు దాటే అవకాశం లేకుండా పోయింది. చంద్రాయన్ పల్లి నుంచి - బైరాపూర్ వెళ్లే దారిలో ప‌లు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వీటికి తోడు రహదారి నిర్మాణ పనులు జరుగుతుండ‌టంతో ఇటువైపు వాహనాలు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. చంద్రాయన్ పల్లి నుండి - గోకారం వెళ్లే దారిలో ఊర వాగు, గండయ్య ఒంపు ప్రమాదకరంగా ప్రవహిస్తుండడంతో ఏ వైపు రాకపోకలు లేకుండా చంద్రాయన్ పల్లి గ్రామం లంక గ్రామాన్ని తలపిస్తుంది. చంద్రాయన్ పల్లి కాలనీ నుంచి కనీసం రైతులు పొలం వద్ద ఉన్న‌ తమ పశువులకు మేత నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. వ్యవసాయ పొలం దగ్గరకు వెళ్లే దారిలో ఉన్న వాగు, వంపుల ఎగువ ప్రాంతాల్లో కురిసిన బారీ వర్షాలకు మునుపెన్నడూ లేని విధంగా నీరు ప్రవహిస్తోంది. దీంతో గ్రామ‌స్తులు ఎక్కడికి వెళ్లే అవకాశం లేక‌పోవ‌డంతో తీవ్ర‌ ఇబ్బందులకు గురవుతున్నారు.

Next Story