బీసి రిజర్వేషన్ కోసం "ఛాయ్ పే చర్చ"

by Ratna Kumari |

దిశ‌, రేవ‌ల్లి : బీసీ రిజ‌ర్వేస‌న్ కోసం ఛాయ్ పే చ‌ర్చ జ‌రిగింది. ఈనెల 24 నుంచి ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లో 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని కోరుతూ మండల పరిధి

బీసి రిజర్వేషన్ కోసం ఛాయ్ పే చర్చ
X

దిశ‌, రేవ‌ల్లి : బీసీ రిజ‌ర్వేస‌న్ కోసం ఛాయ్ పే చ‌ర్చ జ‌రిగింది. ఈనెల 24 నుంచి ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లో 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని కోరుతూ మండల పరిధి లోని బండరాయి గ్రామంలో ఉమ్మడి మహబూబ్ నగర్ విశ్రాంత డీఈవో విజయ్ కుమార్, బీసీపీఎ నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, బీసీటీఏ బాధ్యులు కే రాములు, బీసీ జాక్ నాగర్ కర్నూల్ జిల్లా బాధ్యులు పచ్చిపాల సుబ్బయ్య, మండల్ ఆర్మీ వ్యవస్థాపక అధ్యక్షులుశివశంకర్ యాదవ్ తదితర మేధావుల వర్గం గ్రామంలో బీసి రిజర్వేషన్ కై ఛాయ్ పే చర్చ నిర్వ‌హించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9షెడ్యూల్ లో పెట్టి కోర్టుల నుంచి మినహాయింపు కల్పించి రాజ్యాంగ రక్షణ కల్పించి పార్టీ పరంగా ఇచ్చే రిజర్వేషన్లను వద్దే వద్దు అని బీసీ నాయకులు డిమాండ్ చేశారు. చట్టపరంగా రాజ్యాంగపరంగా లభించే రిజర్వేషన్ బీసీలకు అందివ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో D.బాలస్వామి, k. సురేందర్ గౌడ్,G. వెంకటయ్య, G. శివయ్య, G. జనార్ధన్ పాల్గొన్నారు.

Next Story