కారు బైకు ఢీ.. వ్య‌క్తి మృతి

by Ratna Kumari |

నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం పరిధిలో శుక్ర‌వారం రాత్రి రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది.

కారు బైకు ఢీ.. వ్య‌క్తి మృతి
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం పరిధిలో శుక్ర‌వారం రాత్రి రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్ర గాయాలపాల‌య్యారు. అందులో ఓ వ్య‌క్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అమ్ర‌బాద్ మండ‌ల ప‌రిధిలోని వెంక‌టేశ్వ‌ర్ల బావి గ్రామానికి చెందిన చాంద్ పాషా, వెంక‌టేష్, ప‌ర్వ‌తాలు ముగ్గురు వ్య‌క్తులు అమ్రాబాద్ నుంచి స్వ‌గ్రామానికి వెళ్తున్నారు. మార్గ మ‌ధ్య‌లో ఎల్మప‌ల్లి గేట్ స‌మీపంలో ప్ర‌ధాన ర‌హ‌దారి పై అచ్చంపేట వైపు నుంచి వ‌స్తున్న టీఎస్08యూఎఫ్ 9274 నెంబ‌ర్ గ‌ల కారు ఎదురుగా వ‌చ్చి వీరి బైకును ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు వ్య‌క్తుల‌కు గాయాల‌య్యాయి. వీరిని అంబులెన్స్ లో అచ్చంపేట ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.అప్ప‌టికే చాంద్ పాషా (21) మృతి చెందిన‌ట్టు వైద్యులు ధృవీక‌రించారు. ప‌ర్వ‌తాలు ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో క‌ల్వ‌కుర్తి స‌మీపంలోని యెన్నం ప్రైవేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు కారు డ్రైవ‌ర్ శివ‌కుమార్ పై కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు. ప‌విత్ర రంజాన్ పండుగ పూట వెంక‌టేశ్వ‌ర్ల‌బావి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

Next Story