- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారు- బైక్ ఢీ.. చిన్నారి మృతి.. మరొకరి తీవ్ర గాయాలు..
దిశ, వెల్దండ: రోడ్డు ప్రమాదంలో కారు - బైకు ఢీ కొనడంతో ఓ చిన్నారి మృతి చెందింది. మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం రాత్రి వెల్దండ మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల

దిశ, వెల్దండ: రోడ్డు ప్రమాదంలో కారు - బైకు ఢీ కొనడంతో ఓ చిన్నారి మృతి చెందింది. మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం రాత్రి వెల్దండ మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వంగూర్ మండలం నర్సంపల్లి గ్రామానికి చెందిన సౌడంపల్లి సురేష్ తన ఇద్దరు కూతుర్లతో కలిసి హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో మండల పరిధిలోని చెరుకూరు గేట్ సమీపంలో శ్రీశైలం - హైదరాబాద్ జాతీయ రహదారిపై కారు- బైక్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కూతురు సౌడంపల్లి వరలక్ష్మి (10) అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి సౌడంపల్లి సురేశ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. నిఖితకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో హైదరాబాద్ వైపు వెళుతున్న డీసీఎం కిందికి బైక్ వెళ్లి ఇరుక్కుపోయి మంటలు చెలరేగగా స్థానికులు గమనించి నీటితో మంటలు ఆర్పారు. మంటలు ఆర్పడంతో మరో ప్రమాదం తప్పింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అటుగా ఆ సమయంలో హైదరాబాద్‌కు వెళ్లుతున్న స్థానిక కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు.






