- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారు-బైక్ ఢీ.. వ్యక్తి మృతి
ఎదురెదురుగా వస్తున్న కారు-బైకు ఢీ కొన్న ఘటనలో కారు బోల్తా పడ వ్యక్తి మృతి చెందిన ఘటన మాగనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, మక్తల్ : ఎదురెదురుగా వస్తున్న కారు-బైకు ఢీ కొన్న ఘటనలో కారు బోల్తా పడ వ్యక్తి మృతి చెందిన ఘటన మాగనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మక్తల్ కి చెందిన రాజశేఖర్ తండ్రి వారం రోజుల కిందట కర్ణాటకలోని గూడురు గ్రామంలో మరణించారు. అయితే దశ దిశ కర్మకు వెళ్లి తిరిగి మక్తల్ కి కారులో వస్తున్నారు. అయితే ఇదే సమయంలో మక్తల్ నుంచి కృష్ణ జాతరకు బైకు పై తండ్రి కొడుకులు లోకపల్లి లక్ష్మయ్య(62), బీమేష్ వస్తున్నారు. కారు బైకు ని ఢీ కొట్టడంతో పాటు బోల్తా పడింది. దీంతో లక్ష్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. భీమేష్ కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. రాజశేఖర్, అజయ్ కి గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై మాగనూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు.






