- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గెలుపు-ఓటమి ల ఉత్కంఠలో అభ్యర్థులు
గత వారం రోజులుగా హోరా హోరిగా సాగిన మున్సిపల్ ఎన్నికలు బుధవారం జరిగిన పోలింగ్ తో ముగిసింది.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : గత వారం రోజులుగా హోరా హోరిగా సాగిన మున్సిపల్ ఎన్నికలు బుధవారం జరిగిన పోలింగ్ తో ముగిసింది. ఎన్నో చోట్ల డబ్బు, మద్యం, కానుకలతో ఓటర్లను ప్రలోభపెట్టినట్లు గుసగుసలు వినబడ్డాయి. అన్ని పార్టీల వారి దగ్గర తాయిలాలు తీసుకొన్న ఓటర్లు చివరికి ఎవరికి ఓటు వేశారో సస్పెన్షన్ కొనసాగుతుంది. తాము గెలుస్తామనే ఎవరికి వారే ధీమా తో ఉన్నారు. 'అన్నీ' తీసుకొని ఎవరికి ఓటు వేశారనే ఓటరు నాడి ఎవ్వరూ కనిపెట్టలేకపోతున్నారు. ఎన్నికలు జరగక ముందే సర్వేల పేరు తో కొన్ని మీడియా సంస్థలు పార్టీల జాతకాలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, డిసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ ఒబెదుల్లా కొత్వాల్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, టిపిసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ నుండి ఎంపి డికె అరుణ లు అలుపెరుగకుండా సుడిగాలి పర్యటనతో ప్రచారం చేశారు. చిన్న చిన్న గొడవలతో ఎక్కువ శాతం ఓట్లు పోలైయ్యాయి. మరికొన్ని గంటలు గడిస్తే గానీ అభ్యర్థుల భవితవ్యం తేలదు. ఇందులో భాగంగా 'దిశ' వివిధ పార్టీల నేతల అభిప్రాయ సేకరణ జరిపింది.
మేయర్ సీటు మాదే : ఎ.సంజీవ్ ముదిరాజ్, డీసీసీ అధ్యక్షుడు
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో 35 డివిజన్ల కార్పోరేటర్లను గెలిపించుకొని మహబూబ్ నగర్ కార్పొరేషన్ 'మేయర్' స్థానాన్ని, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీ లను కైవసం చేసుకోబోతున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సారధ్యంలోని ప్రజాపాలనలో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో జరిగిన వేల కోట్ల రూపాయల అభివృద్ధి, అలాగే భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీల్లో జరిగిన, జరుగబోయే అభివృద్ధి పనులతో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని ఈ ఫలితాలు మరోమారు నిరూపించబోతున్నాయి.
సగానికి పైగా సీట్లు సాధిస్తాం : బీఆర్ఎస్ మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్
అధికార కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విచ్చలవిడిగా మందు ఏరులై పారింది. పెద్ద మొత్తంలో డబ్బులు పంచారు. ప్రతిపక్ష పార్టీ అయిన తమ అభ్యర్థులను వేదింపులకు గురి చేశారు.బ్యాలెట్ ముద్రణ కూడా సరిగ్గా లేదు. బీజేపీ, కాంగ్రెస్ మిత్రులు లాగా పనిచేసి మమ్మల్ని ఓడించాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినా రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ లతో చేసిన మోసాలను గల్లీ గల్లీ కి తీసుకెవెళ్లి ప్రజలకు వివరించాము. ఒంటరిగా ఎన్నికల్లో నిలిచి సగానికి పైగా మున్సిపాలిటీ లను కైవసం చేసుకోబోతున్నాం...
మా సత్తా చాటుతున్నాము : పి.శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు
కేంద్ర ప్రభుత్వం నిధులతోనే మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి చెందింది. పార్లమెంటు సభ్యురాలు డికె అరుణ మహబూబ్ నగర్ నియోజకవర్గం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులను పారించింది. అందులో భాగంగా మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, విద్యుత్ రైళ్లు, డబుల్ లైన్ ఏర్పాటు, 60 శాతం కేంద్ర నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, పట్టణంలో ఆర్వోబీ లు లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరుగుతుంది. మా పార్లమెంటు సభ్యురాలు డికె అరుణ మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో మా సత్తా చాటబోతున్నాం.






